Malavya Rajayogam in Seven Zodiac Horoscopes : నవంబర్ 30 నుంచి శుక్రుడు కన్య రాశి నుంచి తులారాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో జ్యోతిష్యం ప్రకారంగా ఏడు రాశుల వారికి మాళవ్య రాజయోగం కలుగనుంది. ఈ కారణంగా కొన్ని రాశులకు అనుహ్యమైన ధనవృద్ది కలుగే అవకాశముంది. మరీ ఈ జాబితాలో మీ రాశి ఉందా? లేదా అని తెలియాలంటే మాత్రం ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే..!
దాదాపు 18 నెలల తర్వాత శుక్రుడు తన మూల త్రికోణ రాశైన తులారాశిలోకి ప్రవేశించాడు. ఈ ఏడాది చివరి నాటి వరకు తులారాశిలో శుక్రుడు బలమైన స్థానంలో నివాసం ఉంటాడు. ఈ కాలంలో మాళవ్య రాజయోగం ఏర్పడటంతో తులారాశితో సహా మరో ఆరు రాశుల వారికి కొన్ని ప్రయోజనాలను చేకూర్చనున్నాడు. ఆర్థికంగా, సామర్థ్యపరంగా, నైపుణ్యాల్లో మంచి ఫలితాలను కలిగించనున్నాడు. ఆ రాశులెంటీ తెలుసుకునేందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.
Sukra Gocharam in Zodiac Horoscopes :
- కన్యారాశి (Virgo) :
శుక్ర గ్రహ సంచారం వల్ల కన్యా రాశి జాతకులకు ధన వృద్ధి కలిగే అకాశముంది. కుటుంబ జీవితంలోనూ పురోగతితోపాటు ఆదాయం పెరిగే అవకాశముంది. జీవిత భాగస్వామితో మీకున్న ఆందోళనలు తొలిగిపోతాయి. ప్రేమానుబంధాలు మెరుగవుతాయి. ఈ సమయం వ్యాపారానికి చాలా అనుకూలంగా ఉండనుంది. కళాత్మక వస్తువులను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతారు.
- తులారాశి (Libra) :
శుక్ర గ్రహం తన స్థానాన్ని మార్చుకోవడం వల్ల తులారాశి జాతకులకు పంచ మహాయోగం కలుగనుంది. ఈ కారణంగా వీరికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరే అవకాశముంది. ఈ జాతకులకు మనోబలం పెరగడంతోపాటు ఆరోగ్యం మెరుగుపడనుంది. తమ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభించనుంది. ప్రేమనుబంధాలు మెరగవుతాయి. తమ వైవాహిక జీవితంలో నెలకొన్న అడ్డంకులు తొలగిపోయే అవకాశముంది. కళాకారులకు ఈ సమయం చాలా ఆశాజనకంగా ఉంటుంది.
- వృశ్చిక రాశి (Scorpio) :
మాళవ్య రాజయోగం (Malavya Rajayogam 2024) కారణంగా వృశ్చిక రాశి జాతకులకు శుభయోగాలు కలుగనున్నాయి. వ్యాపారస్తులకు మంచి రాబడులు వచ్చే అవకాశముంది. ఈ కాలంలో దూర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. అయితే శత్రువుల విషయంలో తగు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వీరి కారణంగా కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. తమ జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఈ సమయంలో ఖర్చులు పెరిగే అవకాశముంది.
- ధనస్సు రాశి (Sagittarius) :
శుక్ర గ్రహం తులారాశిలో ప్రవేశించడం వల్ల ధనస్సు రాశి జాతకులకు ధనవృద్ధి కలుగనుంది. వ్యాపారులకు ఆదాయం పెరిగే అవకాశముంది. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. పిల్లల విషయంలో ఈ కాలం అనుకూలంగా ఉండనుంది. విద్య, కెరీర్ పరంగానూ పురోగతి సాధిస్తారు. తమ తెలివితేటలను ఉపయోగించి సంపదను సృష్టిస్తారు. అయితే కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఒత్తిడి పెరగే అవకాశముంది. అలర్జీ సమస్యలకు తగు చర్యలు తీసుకోవడం శ్రేయస్కరం.
- మకర రాశి (Capricorn) :
శుక్రుడి స్థాన మార్పు, మాళవ్య రాజయోగం కారణంగా మకర రాశి జాతకులకు కొన్ని విషయాల్లో మంచి జరుగనుంది. వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగనున్నాయి. ఉద్యోగులకు పదోన్నతి లభించనుంది. వీరు చేసే పనుల్లో ప్రశంసలు దక్కుతాయి. తమ జీవిత భాగస్వామితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇల్లు, వాహనం, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. తమ పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశముంది.
- కుంభ రాశి (Aquarius) :
శుక్ర గ్రహం (Shukra Gocharam) తులారాశిలోకి ప్రవేశించడం, మాళవ్య రాజయోగం కారణంగా కుంభ రాశి జాతకులకు సైతం శుభయోగాలు కలుగనున్నాయి. ఈ సమయంలో వీరి కుటుంబ జీవితం ఆహ్లాదంగా సాగనుంది. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి. ఉన్నతాధికారుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించనుంది. తమ జీవిత భాగస్వామితో ప్రేమానురాఘాలు మెరుగవుతాయి. దాంపత్య జీవితం సంతోషకరంగా కొనసాగనుంది. తమ తల్లి ఆరోగ్యం సైతం మెరుగు పడే అవకాశాలున్నాయి.
Keywords : Astrology in Telugu, Star Sings, Malavya Rajayogam, Shukra Gocharam, Latest Astrology News, Best Astrology.
Read more : Rajayogam : 700 ఏళ్ళ తర్వాత రాజయోగం వరించేది ఈ జాతకులకేనా..!
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.