Rajayogam 2024 Horoscopes : 2024 కొత్త ఏడాదిలో రాజయోగం ఈ కింది రాశులను వరించనుంది. సుమారు 700 ఏళ్ళ తర్వాత అరుదైన పంచ మహాయోగాలు (Rajayogam Horoscope) ఏర్పడనుండటంతో కొన్ని రాశులకు శుభయోగాలు కలుగనున్నాయి. నవంబర్ 29-30న రాత్రి శుక్రుడు తులారాశిలో సంచరించనున్నాడు.
దీంతో శుక్రుడు, గురుడు ఒకదానికి ఒకటి ఎదురుగా రానున్నాయి. ఈ కారణంగా శష, కేంద్ర త్రికోణ, మాళవ్య, నవ పంచమ, రుచక రాజ యోగాలు కలుగనున్నాయి. ఈ ప్రభావంతో మేష, కన్య, ధనస్సు, మకర రాశి జాతకులకు కెరీర్ పరంగా విజయాలు కలుగడంతో ధనవృద్ధి కలుగే అవకాశం మొండుగా ఉంది.
- Rajayogam After 700 Years These Horoscopes 2024:
మేషరాశి (Aries) :
అరుదైన పంచమ యోగాల కారణంగా మేషరాశి జాతకులకు విదేశీయానం చేసే అవకాశం దక్కనుంది. గురు, శుక్ర స్థానాలు బలంగా ఉండటం వల్ల ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశముంది. జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఏర్పడటంతో వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉండనుంది. కొందరి వల్ల అనుహ్యమైన ఆర్థిక ప్రయోజనాలు దక్కే అవకాశముంది.
కన్యారాశి (Virgo) :
పంచమ రాజయోగాల కారణంగా కన్యా రాశి జాతకులకు జీవితంలో మంచి ఫలితాలు రానున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు లభించే అవకాశముంది. ఈ కాలంలో కన్యరాశి జాతకులు ప్రతీఒక్క అవకాశాన్ని వినియోగించుకొని అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. భవిష్యత్ అవసరాల కోసం కొంత ధనాన్ని పొదుపు చేస్తారు.
ధనస్సు రాశి (Sagittarius) :
ఐదు రాజయోగాల కారణంగా ధనస్సు రాశి జాతకులకు విదేశీయానం కలుగనుంది. కొందరికి విదేశాల్లో మంచి ఉద్యోగం లభించే అవకాశముంది. విద్యార్థులకు సైతం విదేశాల్లో చదువుకునే అవకాశం రానుంది. గురు, శుక్ర గ్రహాల అనుగ్రహంతో ధనస్సు రాశి వారికి అద్భుత ప్రయోజనాలు లభించనున్నాయి. వీరి కోరికలు నేరవేరే అవకాశాలు మొండుగా ఉన్నాయి.
మకర రాశి (Capricorn) :
పంచమ రాజయోగాల కారణంగా మకర రాశి వారికి ధనవృద్ధి కలుగనుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశముంది. కళాకారులు, మీడియా తదితర రంగాలకు చెందినవారు ఈ కాలంలో మంచి పురోగతిని సాధించే అవకాశముంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేవారు శుభవార్తలు వింటారు.
Read more : Four zodiac Signs : నూతన సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి శుభయోగాలు..!
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.