Anjaneya Swamy Abhishekam with One Lakh Bananas : ఆంధ్రప్రదేశ్ లోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో విరజిల్లుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ రూరల్ ప్రాంతంలోని శ్రీపీఠంలో ఏడాది పొడవునా లోక కళ్యాణార్థం విశేష పూజలు జరుగుతున్నాయి. శ్రీ పరిపూర్ణానంద స్వామిజీ పర్యవేక్షణలో వేదపండితులు, పురోహితులు అత్యంత వైభవంగా భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
శ్రీపీఠంలో గత నెలరోజులుగా శతకోటి కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. తాజాగా శ్రీ పరిపూర్ణ స్వామి ఆధ్వర్యంలో దివ్యపీఠంలోని శ్రీరామదూత ఆంజనేయ స్వామికి లక్ష అరటి పండ్లతో అభిషేక కార్యక్రమం వైభోవోపేతంగా జరిగింది.
వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీ రామ దూతాయ నమః అంటూ స్వామివారి పూజలో పాల్గొన్నారు. 11మంది అర్చక స్వాములు స్వామివారి పూజలో పాల్గొని భక్తులు తీసుకొచ్చిన ఒక లక్ష అరటిపళ్ళను శ్రీ ఆంజనేయ స్వామికి సమర్పించారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్ష అరటి పండ్లతో స్వామివారిని అభిషేకించడంతో ఆప్రాంతమంత పసుపుమయంగా మారింది. అశేష భక్తజనం శ్రీరామ దూత జపం చేయడంతో కార్యక్రమం ఆధ్యాంతం కన్నులపండుగలా సాగింది.
భగవంతుడి ముందు పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ స్వామి చెంత ఒకేవిధంగా కూర్చోని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పరిపూర్ణానంద స్వామిజీ చేసిన అనుగ్రహ భాషనం ప్రతీఒక్కరిని ఆధ్యాత్మికం పరవశించేలా కొనసాగింది.
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.