Astro Tips New Year 2024 : 2023 సంవత్సరంలో పడిన ఇబ్బందులకు గుడ్ బై చెప్పి 2024 కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాలని ప్రతీ ఒక్కరు భావిస్తుంటారు. 2024 ఏడాది తమకు అన్ని విధలా కలిసి రావాలని, ఆదాయంలో పురోగతి, ఆనందం, సంతోషం వంటివి తమ ఇంటిలో వెల్లివిరియాలని ఆ దేవుడిని ప్రార్థిస్తుంటారు.
ఈమేరకు కొత్త ఏడాది తొలిరోజున ఎక్కువ మంది ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు. పూజా పునస్కారాలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతుంటారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు.
మరి కొందరు మాత్రం క్యాలెండర్ మారుతుంది తప్ప పెద్దగా జీవితంలో ఒరిగేది ఏమీ ఉండదంటూ లైట్ తీసుకుంటారు. ఎవరీ వాదన ఎలా ఉన్నప్పటికీ కొత్త ఏడాది ప్రారంభం రోజున ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే ఏడాది మొత్తం సంతోషాలతో గడిపే అవకాశముంది. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి. వీలైతే ఆచరించే ప్రయత్నం చేయండి..!
- 2024 ఏడాది ప్రారంభంలో చేయాల్సిన పరిహారాలు..
- మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే.. కొత్త ఏడాది ప్రారంభం రోజున ఉదయం పూజ-పథం చేయాల్సి ఉంటుంది. రాగి కలశంలో నీరు, బెల్లం, మిరియాలు కలిపి సూర్య భగవానుడికి సమర్పించాలి. ఇలా చేస్తే మీరు కోరుకున్న ఉద్యోగం త్వరగా లభించే అవకాశం లభిస్తుంది. కొందరు ఇంట్లోనే పూజలు చేస్తుంటారు. నియమాలు పాటిస్తూ పూజలు చేసే వారికి కూడా ఈ ఏడాది మెరుగ్గా గడిచే అవకాశం ఉంటుంది.
- ఆనందం.. ప్రతికూలత తొలిగిపోయేందుకు.. కొత్త ఏడాదిలో ఆనందం.. ప్రతికూలతలు తొలగిపోయేందుకు ఈ చిన్న పరిహారం చేయండి. ఇంటిని శుభ్రం చేసి అందంగా అలంకరించండి. ఇంట్లో లైటింగ్(వెలుతురు) కోసం తగు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పనుల ద్వారా ఆ ఇంట్లో ప్రతికూలతలు తొలిగి ఆనందం రానుంది.
- అన్నపూర్ణ దేవి అనుగ్రహం కోసం.. కొత్త ఏడాది ప్రారంభంలో ఆహారం.. బట్టలు దానం చేయండి. పేదలకు భోజనం పెట్టడం, బట్టలు, ఐదు కిలోల గోధుమలను దానం చేయండి. దీని ద్వారా ఏడాది పొడవునా ఆ ఇంట్లో ఆహారం నిల్వ ఉంటుంది. అన్నపూర్ణ దేవి అనుగ్రహం కలిగే అవకాశముంది.
- సంతోషం, శ్రేయస్సు కోసం.. కొత్త ఏడాది ప్రారంభం రోజున ఒక రాగి కలశాన్ని నీటితో నింపి అందులో కొంత కుంకుమ పువ్వు కలిపి ఉంచాలి. దీనిని లింగానికి సమర్పించి చేతులు జోడించి నమస్కరించి 108సార్లు ఓం మహా దేవ నమః అనే మంత్రాన్ని పఠించి మీ కోరికను తెలిజేయండి. అలాగే శివుడి వాహనమైన నందికి గడ్డిని, రొట్టెలను తినిపించండి. ఈ చిన్న పరిహరం చేస్తే ఏడాది పొడవునా వారికి సంతోషం, శ్రేయస్సు కలుగనుంది.
- లక్ష్మీ అనుగ్రహం కోసం.. హిందూ మతంలో స్త్రీలను ఇంటికి మహాలక్ష్మీగా భావిస్తారు. ఎరుపు రంగు శ్రేయస్సు చిహ్నంగా భావిస్తుంటారు. ఈ ఏడాది ప్రారంభం రోజున మహిళలు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే ఆ ఇంట్లో సంవత్సరమంతా ఆనందం, శ్రేయస్సు కలుగనుంది.
- దాంపత్య జీవితంలో సమస్యలు తొలిగిపోయేందుకు.. ఈ ఏడాది ప్రారంభం రోజున శివ లింగానికి పరిమళాన్ని సమర్పించండి. దీని ద్వారా మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే తొలగిపోయనున్నారు. శక్తివంతమైన శివ నామాలను స్మరించడం ద్వారా సమస్యల నుంచి బయట పడే అవకాశం లభించనుంది.
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.