New Couple Room : వాస్తు ప్రకారం.. నూతన దంపతులకు ఏ గది మంచిది?

Best New Couple Room in Vastu Sastra : వాస్తు శాస్త్ర ప్రకారంగా మన ఇంటిని నిర్మించుకోవడం అన్ని విధలా శుభయోగాలను కలిగిస్తుంది. ఈ కారణంగానే ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలోనే వాటి యజమానులు వాస్తు ప్రకారం తమ ఇల్లు ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అందుకు తగ్గట్టుగా కాంట్రాక్టర్ లేదా సివిల్ ఇంజనీర్ లేదా తాపీ మెస్త్రీలకు ఇంటి నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తుంటారు. 

New Couple

తమ ఇంటిలోని గదులన్నీ వాస్తు ప్రకారంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. తమ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే స్టడీ రూం వాస్తు ప్రకారం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. దీని వల్ల వారి భవిష్యత్ బాగుంటుందని నమ్ముతారు. ఇక ఇంట్లో పెద్దలు, వివాహిత జంటలు, అతిథుల కోసం సైతం ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేస్తుంటారనే సంగతి తెల్సిందే. 

New Couple Room

వాస్తు ప్రకారం (Vastu Sastra) చూసుకుంటే స్టడీ రూం (Study Room) అనేది ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచుకోవాలి. చదువుకునే పిల్లలు తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చోవడం మంచిదని నిపుణులు చెబుతుంటారు. నైరుతి అంటే కుబేర మూలలో ఉన్న పడక గదిలో కుటుంబ పెద్దలు ఉండటం మంచిదని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. పెళ్లయిన కొత్త జంటలకు (New Couple Room) కూడా నైరుతి పడక గది మంచిది. 

Best New Couple Room

ఇంట్లోని వృద్ధులు, రోజు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు(పిల్లలకు) ఈశాన్య గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటికి వచ్చే అతిథులు కోసం వాయవ్య దిశలో గదిని ఏర్పాటు చేసుకోవచ్చని వాస్తు శాస్త్ర ప్రకారం చెబుతోంది. ఈ ప్రకారం తమ ఇంట్లోని గదులను ఆయా వర్గాల వ్యక్తులు వాడుకున్నట్లయితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు కొదువ ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. 

Read more : Gold Fish : గోల్డ్ ఫిష్ ఇంట్లో ఉంటే ఏం జరుగనుంది?

Keywords : New Couple Room, Best Couple Room, Beautiful Couple Room, New Couples, Marriage, Wedding, Astrology House, Vastu Tips in Houses, Vastu Sastra.

Post a Comment

గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.