Numerology Birth Date : పుట్టిన తేదిని బట్టి ఒకరి వ్యక్తితం అంచనా వేయచ్చా అంటే న్యూమరాలజీ ప్రకారం చెప్పొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి పుట్టిన తేది అతడి జీవితంపై ప్రభావాన్ని చూపనుంది.
న్యూమరాలజీ ప్రకారంగా ఓ వ్యక్తి పుట్టిన తేదిలోని ప్రతి సంఖ్యకు సమాన ప్రాముఖ్యత ఉండనుంది. ఈ సంఖ్యలో పెద్ద సందేశమే దాగివుంటుంది. పుట్టి తేదిలోని చివరి అంకెను బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో కూడా చెప్పొచ్చు.
పుట్టిన తేది (Date of Birth Last Digit) చివరి అంకెను ఎలా గుర్తించాలి?
- పుట్టినన తేదిని పూర్తిగా రాయాలి.
- ముందుగా తేది, ఆ తర్వాత నెల, చివరగా సంవత్సరం రాయాలి.
- పుట్టిన సంవత్సరంలోని ఆఖరి అంకె చివరిది అవుతుంది.
ఉదాహరణకు మే 25, 1990లో ఓ వ్యక్తి పుట్టాడు అనుకుంటే..
- ముందుగా తేది అంటే.. 25ను రాయాలి.
- ఆ తర్వాత నెల అంటే.. మే దీనిని 5 అంకెగా రాయాలి.
- చివరగా సంవత్సరం అంటే.. 1990 అని రాయాలి.
- పుట్టిన సంవత్సరంలో ఆఖరి అంటే జీరో అవుతుంది.
- ఈ కారణంగా పుట్టిన తేది (Numerology Birth Date) చివరి అంకె జీరో ‘0’ అని అర్థం.
- ఈ మాదిరిగానే 1970, 1980, 1990, 2000, 2010, 2020 సంవత్సరాలకు కూడా ‘జీరో’నే చివరి అంకె జీరోనే అవుతుంది.
- ఈ సంవత్సరాల్లో పుట్టిన వారందరి పుట్టిన తేది చివరి అంకె జీరోనే అవుతుంది.
- పుట్టిన తేది చివరి అంకె జీరో (0) కలిగిన వ్యక్తులు..
Numerology Date of Birth 0 : న్యూమరాలజీ, ఐచిన్గ్ న్యూమరాలజీ ప్రకారంగా జీరో(0) చివరి సంఖ్య కలిగిన వ్యక్తులు మెటల్ ఎలిమెంట్ వర్గానికి చెందుతారు. దీని ప్రకారంగా.. ఈ వ్యక్తులు చాలా తెలివైన వారు ఉంటారు. నిర్మోహమాటంగా నిర్ణయాలు తీసుకోగలుతారు. ప్రతి విషయం స్వయంగా చూసుకోగలుగుతారు. అందరి ముందు నిజమైన వ్యక్తిత్వాన్ని దాచుకోగలరు. కొంతమందికే వీరి నిజమైన వ్యక్తిత్వం చూపిస్తారు. అయినప్పటికీ వీరి వ్యక్తిత్వం చాలా మందికి నచ్చుతుంది. కీలక విషయాల్లో గెలుపు సాధించే వరకు విశ్రమించరు. ఉన్నత స్థానం కోసం ఎంతో శ్రమించి విజయం సాధిస్తారు.
వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకునే సూచనలు.. వీరు గెలుపొందాలన్న, జీవితంలో పైకి రావాలన్న ఓర్పు ఎంతో అవసరం. సహనంగా ఉంటే ఏ పనినైనా సాధించగలుతారు.
- పుట్టిన తేది చివరి అంకె నెంబర్ వన్(ఒకటి) కలిగిన వ్యక్తులు..
ఉదాహరణకు 1961, 1971, 1981, 1991, 2001, 2011, 2021 సంవత్సరాల్లో పుట్టిన వారు. న్యూమరాలజీ, ఐ చిన్గ్ న్యూమరాలజీ ప్రకారంగా పుట్టిన తేది చివరి అంకె నెంబర్ వన్ )Numerology Date of Birth 1) చివరి కలిగిన వ్యక్తులు కూడా మెటల్ ఎలిమెంట్ వర్గానికి చెందిన వారే అవుతారు. వీరిలో చాలా పోటీతత్వం ఉంటుంది. విజయం సాధించిన ప్రతి దానిని సంతోషంగా స్వీకరిస్తారు. వీరిని ప్రతీఒక్కరూ ఆదర్శంగా తీసుకుంటారు. వీరు తమ కలలను సాధించుకోనేందుకు యోధుడిగా పోరాడుతారు. సులువుగా దేనిని వదులుకోరు. చివరివరకు పట్టుదలతో ప్రయత్నిస్తారు.
వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకునే సూచనలు.. ఈ ప్రపంచంలో లోపం లేనిది ఏది లేదు అనేది గుర్తించుకోవాలి. అతిగా ఎవరి నుంచి ఆశించొద్దు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సర్దుకు పోవాల్సి ఉంటుంది. ఎలాంటి పరిస్థితులనైన ఎదుర్కుకునేందుకు సిద్దంగా ఉండండి.
- పుట్టిన తేది చివరి అంకె నెంబర్ 2 కలిగిన వ్యక్తులు..
జీరో న్యూమరాలజీ, ఐ చిన్గ్ న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 2 (Numerology Date of Birth 2) చివరి అంకె కలిగిన వ్యక్తులు నీరు ఎలిమెంట్ వర్గానికి చెందుతారు. వీరికి రెండు వ్యక్తిత్వాలు ఉంటాయి. వీరిని ప్రేమించే వారితో ఒకలా ఉంటారు. తెలియని వారిలో మరొకలా ఉంటారు. వీరు రెండు విధలా ప్రవర్తిస్తారు కాబట్టి వ్యక్తిత్వం చంచలనంగా ఉంటుంది.
వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకునే సూచనలు.. నెంబర్ 2 వ్యక్తులు ఎలాంటి సంఘన వచ్చినా సీరియస్ గా తీసుకోవద్దు. పట్టువిడుపులు ఉంటే మంచిది. ఈ అంశాన్ని వీరు ఎంతగానో నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతీ విషయాన్ని మనస్సులోకి తీసుకోవడం మానేస్తే సంతోషంగా జీవితం గడుస్తుంది.
- పుట్టిన తేది చివరి అంకె నెంబర్ 3 కలిగిన వ్యక్తులు..
న్యూమరాలజీ, ఐ చిన్గ్ న్యూమరాలజీ ప్రకారంగా నెంబర్ 3 (Numerology Date of Birth 3) చివరి అంకె కలిగిన వ్యక్తులు సైతం నీరు ఎలిమెంట్ కు వర్గానికి చెందుతారు. వీరిలో మల్టీ డైమెన్షనల్ వ్యక్తిత్వం ఉంటుంది. జీవితం గురించి వీరిలో విభిన్నమైన అభిప్రాయాలుంటాయి. ఈ ఆలోచనలతోనే నిర్ణయాలు తీసుకుంటారు. అయితే అది సొంత అభిప్రాయమైన కావచ్చు లేదంటే ఎవరి అభిప్రాయమైన కావొచ్చు.
వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకునే సూచనలు.. వీరు భిన్నంగా ఆలోచించడం వరకు ఒకే గానీ ఇతరుల మాటలను సైతం వినండి. వారి ఆలోచనలు, ఇష్టయిస్టాలను కూడా గౌరవించడం మంచిది.
- పుట్టిన తేది చివరి అంకె నెంబర్ 4 కలిగిన వ్యక్తులు..
న్యూమరాలజీ, ఐ చిన్గ్ న్యూమరాలజీ ప్రకారంగా పుట్టిన తేది చివరి అంకె 4 (Numerology Date of Birth 4) కలిగిన వ్యక్తులు చెక్క ఎలిమెంట్ వర్గానికి చెందుతారు. వీరి వ్యక్తిత్వం చుట్టుపక్కల పరిసరాల్లో ఏం జరుగుతుందో అనే విషయం ద్వారా తెలుస్తుంది. ఇతరులకు ఎటువంటి అవసరాలు ఉన్నాయో వీరికి త్వరగా అర్థమవుతుంది. వీరి ఆలోచనలే వీరికి ఆస్తిగా మారుతాయి.
వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకునేందుకు సూచనలు.. వీరు ప్రతి ఒక్క విషయానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మీపై మీరు ఒత్తిడిని పెంచుకోవద్దు.
- పుట్టిన తేది చివరి అంకె నెంబర్ 5 కలిగిన వ్యక్తులు..
న్యూమరాలజీ, ఐ చిన్గ్ న్యూమరాలజీ ప్రకారంగా పుట్టి తేది చివరి అంకె నెంబర్ 5 (Numerology Date of Birth 5) కలిగిన వారు సైతం చెక్క అనే ఎలిమెంట్ వర్గానికే చెందుతారు. ఈ వ్యక్తులు ఇతరులపై జాలి, కరుణ వంటి భావాలను కలిగి ఉంటారు. మంచి మనిషిగా వీరు గెలువడానికి వీరి వ్యక్తిత్వం ఎంతో దోహదపడుతుంది. ఇదే వీరికి బలంగా మారుతుంది. వీరు కోరుకున్న దానిని సాధించుకోగలుగుతారు. పంచభూతాలు సైతం వీరి వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకునేలా ప్రభావితం చేస్తాయి.
వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకునేందుకు సూచనలు.. వ్యక్తిగత, సామాజిక జీవితం కోసం విడిగా సమయం కేటాయించడం నేర్చుకోవాలి. ఇది కష్టంగా లేనట్లయితే సమయాన్ని రెండు భాగాలుగా చేసుకొని జీవించడం మంచిది.
- పుట్టిన తేది చివరి అంకె నెంబర్ 6 కలిగిన వ్యక్తులు..
న్యూమరాలజీ, ఐ చిన్గ్ న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 6 చివరి అంకె (Numerology Date of Birth 6) ఉన్నవారు అగ్ని అనే ఎలిమెంట్ వర్గానికి చెందుతారు. వీరికి జీవితంలో జరిగే ప్రతి విషయంలో చీకటి కోణాలను పరిశీలించి.. ఆనందాన్ని పొందడటమంటే ఎంతో ఇష్టం. అంతేకాక చీకటి కోణాలను వెతుక్కొని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే అదికూడా మంచి విధానంగానే. వీరిలో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. అదెంటంటే వీరిని ఎవరైనా భయపెట్టిన లేదా బెదిరించిన వారిని సులభంగా వీరి జీవితంలో నుంచి తీసేయగలుగుతారు.
వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకునేందుకు సూచనలు.. ఏ బంధంలోనైనా ఎక్కువ పాజిటివ్ గా ఉండకండి. మీ భాగస్వామికి కావాల్సిన వ్యక్తిగత స్వేచ్ఛను ఇవ్వండి.
- పుట్టిన తేది చివరి అంకె నెంబర్ 7 కలిగిన వ్యక్తులు..
న్యూమరాలజీ, ఐ చిన్గ్ న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేది చివరి అంకె నెంబర్ 7 (Numerology Date of Birth 7) కలిగి వారు సైతం అగ్ని ఎలిమెంట్ కు వర్గానికి చెందుతారు. వీరిలో అద్భుతమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఇతరులపై సైతం ఎంతో ప్రేమను చూపిస్తారు. నవ్వుతూ పలకరిస్తారు. ఈ నవ్వు వెనుక కొన్ని రహస్యాలు సైతం దాగివుంటాయి. దీంతో వీరిపై ప్రతీ ఒక్కరూ ఆసక్తిని చూపిస్తుంటారు.
వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకునేందుకు సూచనలు.. మీపై మీరు ఒత్తిడిని పెంచుకోవద్దు. ప్రశాంతంగా ఉండండి.
- పుట్టిన తేది చివరి అంకె నెంబర్ 8 కలిగిన వ్యక్తులు..
న్యూమరాలజీ ప్రకారంగా పుట్టిన తేది చివరి అంకె నెంబర్ 8 కలిగిన వారు (Numerology Date of Birth 8) భూమి అనే ఎలిమెంట్ వర్గానికి చెందినవారు. వీరి ఆలోచనలు చాలా లోతుగాను, సీరియస్ గా ఉంటాయి. కొత్త ఆలోచనలు, ఎవరు ఊహించనటువంటి ఉద్దేశాలను కలిగి ఉంటారు. అర్థవంతమైన సంభాషణను మాత్రమే ఇష్టపడుతారు. వీరు తాము ప్రేమించిన వారికి ఎంతో విలువను ఇస్తారు.
వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకునే సూచనలు.. ఇతరులకు సహాయం చేయడం మంచిదే అయితే త్యాగాలు మాత్రం చేయకండి. ఈ విషయంలో మీకున్న అవసరాలను సైతం గుర్తించుకోవడం మంచిది. .
- పుట్టిన తేది చివరి అంకె నెంబర్ 9 కలిగిన వ్యక్తులు..
న్యూమరాలజీ ప్రకారంగా పుట్టిన తేది చివరి అంకె నెంబర్ 9 (Numerology Date of Birth 9) కలిగిన వారు సైతం భూమి ఎలిమెంట్ వర్గానికి చెందుతారు. వీరు చాలా జాగ్రత్తగా ఆలోచనలు చేస్తారు. వీరి ఆలోచనలకు సరిపడని వ్యక్తుల వీరి వద్దకు వచ్చినపుడు మరింత జాగ్రత్తగా సమాధానమిస్తారు. వీరి ఆలోచనా విధానం అత్యుత్తమంగా ఉంటుంది. వీరు మాటల్లోనే కాకుండా చేతల్లోనూ ఉత్తమంగా ఉంటారు. వీరిని ఎవరూ వేలెత్తి చూపలేరు.
వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకునే సూచనలు.. ఆలోచనలను క్షుణ్ణంగా చేయాలి. ఇతరులు చెప్పే మాటలను జాగ్రత్తగా వినండి. వారి ఆలోచనలు సైతం గౌరవించండి.
Keywords : Numerology Birth Date, Numerology Birthday, Astrology Telugu, Numerology, Date of Birth Numerology.
Read more : Alphabet in Numerology : పేరులోని తొలి అక్షరం ఏం తెలియజేస్తుంది?
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.