Christmas Vastu Tips 2023 : యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతీయేటా డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు ఆయా దేశాల్లో ఘనంగా క్రిస్మస్ సంబురాలను నిర్వహిస్తారు.
క్రిస్మస్ రోజున శాంటా పిల్లలకు బహుమతిని తీసుకొస్తుందని నమ్ముతారు. దీంతో ఈరోజు కోసం చిన్నారులు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. ఇంటిని ప్రత్యేకంగా అలరించుకుంటారు. ఇందులో భాగంగా క్రిస్మస్ ట్రీని ఇంటిలో ఏర్పాటు చేస్తారు.
New Couple Room వాస్తు ప్రకారం.. నూతన దంపతులకు ఏ గది మంచిది?
క్రిస్మస్ ట్రీని ఇంటిలో ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకుంటే ప్రతికూలత తొలగిపోయి అనుకూలతలు వస్తాయని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇంట్లో క్రిస్మస్ ట్రీ నాటుకోవడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు. నెగిటీవ్ ఎనర్జీని దూరంచేసి పాజిటివ్ ఎనర్జీని ఇంటిలోకి తీసుకురావడంలో క్రిస్మస్ ట్రీ శక్తివంతంగా పని చేయనుందని పేర్కొంటున్నారు.
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని నిరుపేదలు, పేద పిల్లలకు రాత్రిపూట మిఠాయిలు, ఆటవస్తువులు, బట్టలు దానం చేస్తే యేసుక్రీస్తు సంతోషిస్తాడు. పేదలకు సాయం చేయడమంటే దేవుడిని పూజించడమే అవుతుంది. ఈ పనులు చేసే వారికి యేసు క్రీస్తు శుభ ఫలితాలు కలుగజేస్తాడని ప్రజలు విశ్వసిస్తుంటారు.
కాగా కరోనా పరిస్థితులు కారణంగా గత రెండు మూడేళ్లు క్రిస్మస్ సంబరాలు బోసిపోయాయి. అయితే ఈ ఏడాది మాత్రం కరోనా ఛాయలు ప్రపంచవ్యాప్తంగా పెద్దగా లేకపోవడంతో ఆయా దేశాల్లో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.
Gold Fish గోల్డ్ ఫిష్ ఇంట్లో ఉంటే ఏం జరుగనుంది?
Keywords : Christmas Vastu Tips, Happy Christmas 2023, Christmas Tress, Christmas Santa's, Astrology in Telugu, Astrology Telugu, Numerology, Astrology House, Devotional News.
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.