Deepika Padukone in Tirumala : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ కలియుగ శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం నాడు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో దీపికా తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో దీపికా పదుకోన్ కు వేద పండితులు ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు శేష వస్త్రంతో ఆమెను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయం వెలుపల పలువురు భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తిని చూపించారు.
కాగా గురువారం రాత్రి అలిపిరి కాలబాట మార్గంలో గోవింద నామస్మరణ చేస్తూ దీపికా పదుకోన్ తిరుమలకు చేరుకున్నారు. మూడున్నర గంటల పాటు నడక మార్గంలో సామాన్య భక్తులతో కలిసి నడిచారు. ఈసందర్భంగా పలువురు ఆమెకు షేక్ హ్యండ్ ఇస్తూ సెల్ఫీలు దిగారు.
ఆ తర్వాత దీపికా పదుకోన్ తిరుమలలోని రాధేయం అతిథిగృహానికి చేరుకున్నారు. గురువారం రాత్రి ఆమె అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.
మరోవైపు దీపికా పదుకోన్ ఇటీవల షారుఖ్ ఖాన్ తో కలిసి నటించిన ‘జవాన్’ మూవీ బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. ఈ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్ మార్క్ ను దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ‘ఓంశాంతి’ చిత్రంతో బాలీవుడ్ కు పరిచయమైన దీపిక పదుకోన్ ప్రస్థానం నేటికి అప్రహతీతంగా కొనసాగుతోంది.
Read more : చాముండేశ్వరీ సన్నిధిలో మెగా పవర్ స్టార్ రాంచరణ్
Keywords : Actress Deepika Padukone in Tirumala, Deepika Padukone in Tirumala, Deepika Padukone, Bollywood Updates, Bollywood News, Devotional News, Astrology in Telugu.
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.