Explanation of Gayatri Mantra : పురాణల ప్రకారం గాయత్రీ మంత్రానికి విశేషమైన శక్తి ఉందని హిందువులు నమ్ముతారు. ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల కష్టాల నుంచి విముక్తి లభించి జీవితంలో సంతోషంగా ఉంటారని నమ్ముతారు.
ఈ మంత్రం యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేందుకు ప్రతీఒక్కరూ ఆసక్తి చూపుతుంటారు.ఈ మహిమన్వితమైన గాయత్రి మంత్రం విశేషాలెంటో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
గాయత్రీ మంత్రం (Gayatri Mantra Explanation) వివరణ..
గాయత్రీ మంత్రం అనేది రుగ్వేదంలో తొలిసారిగా ప్రస్తావించబడింది. సంస్కృతంలో చెప్పబడింది. ఈ మంత్రాల్లోని ‘వ్యాహృతులు’ అనేవి దివ్యమైన శక్తిని కలిగి ఉండి మూడు కాలాలను సూచిస్తుంటాయి. ఈ మంత్రంలో మొత్తం 24 భీజాక్షరాలు ఉంటాయి. ఈ భీజాక్షలను ఆధారంగా చేసుకొని మన పూర్వీకులు ఆలయాలను సైతం నిర్మించి ఈ మంత్రం ప్రాముఖ్యతను ప్రజల్లోకి మరింతగా చేరేలా దోహదపడ్డారు.- గాయత్రీ మంత్రం మరియు అర్థం.. (Gayatri Mantra Meaning ) :
Gayatri Mantra Text : ‘‘ఓం భూర్భువః సువః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్’’
- తాత్పార్యం (లేదా) భావం : ‘‘మేము దైవిక జీవి.. సృష్టికర్త ప్రకాశాన్ని ధ్యానిస్తాము.. ఆ భగవంతుడి తేజస్సు మన మేధస్సును సన్మార్గంలో నడపడానికి ప్రేరేపిస్తుంది’’. ఈ మంత్రంలోని ప్రతీ భీజాక్షరం మహిమాన్వితమైనదిగా చెప్పబడింది. ఈ మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను పూజించిన పుణ్యఫలం దక్కుతుందని రుగ్వేదంలో చెప్పబడింది. గాయత్రీ దేవిని వేదాలకు తల్లిగా భావిస్తారు. అందుకే చాలామంది ప్రతిరోజూ ఉదయాన్నే గాయత్రీ మంత్రాన్ని స్వచ్ఛమైన మనసుతో పఠిస్తుంటారు. అయితే ఈ మంత్రాన్ని ఏ సమయంలోనైనా పఠించవచ్చని శాస్త్రాల్లో పేర్కొనబడింది.
108సార్లు పఠిస్తే శుభ ఫలితాలు..
ఈ మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే మంచి మంచి ఫలితాలు వస్తాయని చెప్పబడింది. ప్రతీరోజు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పేదరికం తగ్గడంతోపాటు ఆర్థిక ప్రయోజనాలు చేకూరనుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు ప్రయోజనాలు కలుగునున్నాయి. వివాహాపరమైన సమస్యలు ఉన్నట్లయితే సోమవారం ఉదయం పసుపు రంగు దుస్తులు ధరించి 108సార్లు గాయత్రీ మంత్రాన్ని జపిస్తే శుభ ఫలితాలు వస్తాయని శాస్త్రంలో పేర్కొనబడింది.
- గాయత్రీ (Gayatri Mantra Benefits ) మంత్రం యొక్క ప్రయోజనాలు..
ప్రతిరోజూ గాయత్రీ మంత్రాన్నిపఠించడం ద్వారా జీవితంలో సంతోషం, విజయం దక్కుతాయి. దీనిని క్రమం తప్పకుండా ఆచరించడం ద్వారా మనస్సు నియంత్రణలో ఉండి మెదడు చురుకుగా పని చేస్తుంది. ఏకాగ్రతను కాపాడుకోవచ్చు. ఒత్తిడి, ఆందోళన తగ్గి ప్రశాంతత కలుగుతుంది. ఈ మంత్రం పఠించడం ద్వారా శరీరంలోని నెగిటీవ్ ఎనర్జీ(విష పదార్థాలు) బయటికి వెళుతాయి. తద్వారా నాడి వ్యవస్థ, శ్వాస పనితీరు మెరుగుపడుతుంది. దుఃఖం, బాధలు, పాపాలు తొలగిపోతాయి.
Weekly Horoscopes December 2nd Week
శివ గాయత్రీ మంత్రం (Shiva Gayatri Mantra Benefits) యొక్క ప్రయోజనాలు..
శివ గాయత్రీ మంత్రాన్ని కొత్త దంపతులు సంతానం కోసం పఠిస్తారు. మనం తలపెట్టిన కార్యంలో విజయం కోసం, పనిలో పురోగతి కోసం ఈ మంత్రాన్ని పఠిస్తారు. ప్రత్యర్థులపై ఆధిపత్యం సాధించేందుకు నెయ్యి, కొబ్బరికాయ హవానం చేయొచ్చు. పూర్వీకుల, కాలసర్ప దోషాలు, రాహు-కేతు, శని దోషాల నివారణకు సైతం శివ గాయత్రీ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రంలో చెప్పబడింది.
Keywords : Astrology, Astrology Telugu, Numerology, Explanation of Gayatri Mantra, Gayatri Mantra Meaning, Gayatri Mantra in English, Gayatri Mantra Benefits, Star Signs, Astro House, Horoscopes.
Read more : Rajayogam : 700 ఏళ్ళ తర్వాత రాజయోగం వరించేది ఈ జాతకులకేనా
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.