Gold Fish : ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ(బట్టలు) అనేవి తప్పనిసరి. మనిషి తన శరీరాన్ని, కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఒక స్థిర నివాసం ఏర్పరుచుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా మనిషి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇంటిని నిర్మించుకొని అందులో జీవించడం మొదలుపెట్టాడు. అయితే ఇల్లు నిర్మించుకునే సమయంలో వాస్తుకు సంబంధించిన కొన్ని చర్యలు తీసుకుంటే ఆ ఇంట్లో ఆనందం కొలువుదీరుతుందని వాస్తు శాస్త్రం (Vastu Shastra) చెబుతోంది.
ఇదిలా ఉంటే ఇంట్లో ఫర్నిచర్, ఇతరత్ర బొమ్మలు (Toys), అలంకరణ సామాగ్రి సైతం వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు దక్కుతాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. కొందరు తమ ఇంట్లో అక్వేరియంలను ఏర్పాటు చేసుకొని అందులో గోల్డెన్ ఫిష్(అదృష్ట చేప)ను పెంచుతుంటాయి. ఈక్రమంలోనే గోల్డెన్ షిప్ పెంపకం వల్ల ఆ ఇంట్లో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
వాస్తు శాస్త్ర ప్రకారంగా గోల్డ్ ఫిష్ ను అదృష్ట చేపగా (Lucky Fish) పిలుస్తున్నారు. ఈ చేపలను అక్వేరియంలో ఉంచడం ద్వారా ఆ ఇంట్లోకి అదృష్టాన్ని తీసుకురావడంతోపాటు ఆకర్షణను తెస్తాయి. గోల్డ్ చేపలు (Gold Fish) సామరస్యాన్ని సూచిస్తాయి. ఇది ఇంటిలోకి అపారమైన సంపదను తీసుకొస్తుందని నమ్ముతుంటారు. దీని వల్ల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడనుంది.
ఇంట్లోని డ్రాయింగ్ రూంకు తూర్పు లేదా ఉత్తర దిశల్లో అక్వేరియంను ఏర్పాటు చేసి అందులో గోల్డెన్ ఫిష్ ను ఉంచవచ్చు. అక్వేరియంలో చేపలు (Aquarium Fish) ఈత కొడుతూ అటూ ఇటూ తిరగడం ద్వారా ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోనుంది. గోల్డ్ ఫిష్ లాగే అరోవానా చేప కూడా పవిత్రమైనది. ఈ చేపను సైతం అక్వేరియంలో పెంచడం వల్ల సంపద ఇంటిలోకి వస్తుందని వాస్తు శాస్త్రం (Vastu Shastra) పేర్కొంటుంది. ఏదిఏమైనా ఇంట్లో చిన్న అక్వేరియం ఏర్పాటు చేసి చేపలను పెంచడం ద్వారా ఆ ఇంటికి మాత్రం ఆకర్షణ పెరగడం ఖాయం.
ఈ కారణంగానే చాలామంది ఇంట్లో అక్వేరియంను (Aquarium) ఏర్పాటు చేసుకొని గోల్డ్ ఫిష్ లను పెంచుకుంటూ వాటిని తమ ఇంట్లోని సభ్యుల్లా చూసుకుంటూ మురిసిపోతుంటారు. ఇక ఇంట్లో చిన్నారులు ఇంట్లో ఉంటే ఆ చేపలతోనే ఎక్కువ సేపు కాలక్షేపం చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏదిఏమైనా గోల్డ్ ఫిష్ పెంపకం అనేది ఒకరకంగా ఇంట్లోకి ఆకర్షణను తీసుకు రావడంతోపాటు అదృష్టాన్ని కూడా తీసుకురావడం శుభపరిణామంగా చెప్పుకొవచ్చు.
Keywords : Gold Fish, Vastu Shastra, Aquarium Fish, Aquarium, Vastu Tips Telugu, Astrology House. Astrology Telugu, Astrologytelugu.com.
Read more : Alphabet in Numerology : పేరులోని తొలి అక్షరం ఏం తెలియజేస్తుంది?
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.