Kanakadurgamma Temple : అభివృద్ధి పనులకు సీఎం శంకు స్థాపన

Kanakadurgamma Temple Development : ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కనక దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులకు గురువారం సీఎం జగన్మోహన్ రెడ్డి శంకు స్థాపన చేశారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అన్నప్రసాద భవనం.. ప్రసాదం తయారీ పోటు.. రాజగోపురం ముందు భాగంలో మెట్ల నిర్మాణం.. ఆలయానికి దక్షిణం వైపు అదనపు క్యూ కాంప్లెక్స్.. కనకదుర్గ నగర్ ప్రవేశం వద్ద మహారాజ ద్వార నిర్మాణం, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ వంటి పనులకు సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు భూమి పూజ చేశారు. 

Kanakadurgamma Temple Development

  • రూ. 216 కోట్ల విలువైన పనులు త్వరలో ప్రారంభం

పనుల అంచనా వ్యయం సుమారు రూ.216 కోట్లు అని తెలుస్తోంది. ఈ పనులు దాదాపు 18నెలల్లో పనులు పూర్తి కానున్నాయి. ఎన్నికల సమయంలోనూ ఈ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టనున్నారు. కాగా జగన్ సర్కార్ గతంలోనే 70 కోట్ల విలువైన నిధులతో పూర్తిచేసిన అభివృద్ధి పనులను సైతం ఆయన ప్రారంభించారు. 

3.87కోట్ల నిధులతో పునఃనిర్మాణం చేపట్టిన 8 ఆలయాలను జగన్ ప్రారంభించారు. అలాగే ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న బొడ్డు అమ్మ.. అమ్మవారి పాత మెట్ల మార్గంలోని గణపతి.. హనుమంతుడి ఆలయాలను సైతం సీఎం ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో సీఎం వెంట దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. హోంమంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.


Keywords : Kanakadurgamma Temple, Vijaywada Kanaka Durgamma Temple, Andhra Pradesh, CM Jagan, Indrakiladri Temple in Vijawada, Astrlogy Telugu.


Kanaka Durgamma Temple Vijayawada : దుర్గమ్మ సన్నిధిలో ‘బాబు’

Chamundeswari Temple : చాముండేశ్వరీ సన్నిధిలో మెగా పవర్ స్టార్ రాంచరణ్

Post a Comment

గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.