Kanaka Durgamma Temple Vijayawada : దుర్గమ్మ సన్నిధిలో ‘బాబు’

Kanaka Durgamma Temple Vijayawada Visited Chandra Babu Naidu : కనకదుర్గమ్మను సతీసమేతంగా దర్శించుకున్న చంద్రబాబు నాయుడు.

Kanaka Durgamma Temple Vijayawada

విజయవాడ కనకదుర్గ అమ్మవారిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా శనివారం నాడు దర్శించుకున్నారు. ఉదయమే కనక దుర్గమ్మ ఆలయానికి చంద్రబాబు నాయుడు, ఆయన భార్య నారా భువనేశ్వరీ, పలువురు టీడీపీ నాయకులు చేరుకున్నారు. వీరికి ఆలయ ముఖ ద్వారం వద్ద మేళాతాళాలతో వేద పండితులు ఘన స్వాగతం పలికారు. 

కనక దుర్గమ్మను ((Kanaka Durgamma Temple Vijayawada) దర్శించుకున్న అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. తెలుగుజాతికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తగిన శక్తి ప్రసాదించాలని కోరుకున్నట్లు వెల్లడించారు. తెలుగు ప్రజలు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉండాలని, వారికి ప్రజా సేవ చేసే అవకాశం కల్పించాలని వేడుకున్నట్లు తెలిపారు. 

Read more : Rajayogam : 700 ఏళ్ళ తర్వాత రాజయోగం వరించేది ఈ జాతకులకేనా..!

కనక దుర్గమ్మ శక్తి స్వరూపిణి అని.. సమాజాన్ని రక్షించి.. దుష్టులను శిక్షించేలా చూడాలని ప్రార్థించినట్లు వెల్లడించారు. తనకు కష్టం వచ్చినపుడు ఎంతోమంది ధర్మం.. న్యాయం కోసం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల్లోనూ అండగా పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. మానవ సంకల్పానికి దైవ సహాయం ఎంతో అవసరమన్నారు. అందుకే దైవ దర్శనాలు చేస్తున్నానట్లు చెప్పారు. అధికార యంత్రాంగం తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని కోరారు.

అంతకముందు కనక దుర్గమ్మ ఆలయానికి (Vijayawada Kanaka Durgamma Temple Accommodation)  వచ్చిన చంద్రబాబుకు కేశినేని నాని, చిన్ని, జనసేన నేత పోతిన మహేష్, పంచుమర్తి అనురాధ, అశోక్ బాబు, దేవినేని ఉమ తదితరులు ఘన స్వాగతం పలికారు.

ఇక ఈరోజు సాయంత్రం చంద్రబాబు విశాఖకు వెళ్లి సింహాచలం అప్పన్నను దర్శించుకోనున్నారు. ఆ తర్వాత నేరుగా హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లనున్నారు. డిసెంబర్ 5న శ్రీశైలం మల్లన్న సేవలో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఆ తర్వాతి రోజుల్లో కడప దర్గా, గుణదల మేరీమాత చర్చిలను సైతం చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారు. 


Keywords : Kanaka Durgamma Temple Vijayawada, Vijayawada Kanaka Durgamma Temple Accommodation, Chandrababu Naidu, Nara Bhuvaneshwari, Devotional News. Astrologytelugu.com

Read more : Four zodiac Signs : నూతన సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి శుభయోగాలు..!

Post a Comment

గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.