Ayodhya Ram Temple Timings : రామ జన్మభూమి అయోధ్యలో రామమందిర నిర్మాణం వైభవోపేతంగా జరిగింది. ఆలయ ప్రారంభోత్సవం దేశ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అట్టహసంగా జరిగింది. ఈ వేడుక అనంతరం సాధారణ భక్తులకు అనుమతి ఇచ్చారు. ఈక్రమంలోనే అయోధ్యకు వేలాదిమంది భక్తులు తరలి వెళుతుండటంతో అన్నిదార్లు అయోధ్య వైపే వెళుతున్నాయి.
అయ్యోధ్య వెళ్లాలని అనుకునే సందర్శకులు, భక్తులు ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. ముందుగా పూజా, దర్శన వేళల మార్పు వివరాలు తెలుసుకుంటే అక్కడికి వెళ్లాక సమస్యలు రాకుండా ఉంటాయి.
పుట్టినతేది బట్టి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చా
కేంద్ర ప్రభుత్వం అయోధ్యలో రామమందిరాన్ని ప్రోత్సహిస్తున్నందున శ్రీరాముని దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. దీంతో భక్తుల రద్దీని కట్టడి చేయడం ఆలయ నిర్వాహకులకు కష్టతరంగా మారుతుంది. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు సమాచారం అందడంతో పూజ, దర్శన సమయంలో కొన్ని మార్పులు చేశారు.
ఈమేరకు ఇక నుంచి ఉదయం 4.30 గంటలకు శ్రీరాముడికి శృంగార హారతి ఇవ్వనున్నారు. ఉదయం 6.30 గంటలకు మంగళ ప్రార్ధన కూడా చేస్తారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి శ్రీరాముని దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి నైవేద్యం చేస్తారు. రాత్రి 7.30 గంటలకు హారతి కార్యక్రమం, రాత్రి 8 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి.
రాత్రి 10 గంటలకు చివరి శయన హారతి (భక్తి సేవ) సమర్పిస్తారు. ఈ వివరాలను ఖిదు పరిషత్ అధికార ప్రతినిధి శరద్ శర్మ వెల్లడించారు. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు.
పూజ సమయాలలో మార్పు కారణంగా, భక్తులు ఇప్పుడు ఉదయం 7 గంటల తర్వాత మాత్రమే స్వామిని దర్శించుకోవచ్చు. అయితే తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు క్యూలో నిలబడతారు. విపరీతమైన చలిని కూడా లెక్క చేయడం లేదు. భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. కొంతకాలం తర్వాత ఈ సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అప్పటిదాకా పూజ వేళల్లో మార్పులు ఉండే అవకాశముంది.
भाग्यशाली हैं वे लोग जो प्रभु के दरबार से आज के मंगला आरती के दर्शन कर दिन की शुरुआत करेंगे।
— Ayodhya Darshan (@ShriAyodhya_) January 26, 2024
🙏 " जय श्री राम " 🙏 pic.twitter.com/07QYLYVsyA
Keywords : Ayodhya Ram Temple Timings, Ayodhya Ramalayam, Ajodhya Temple Timings, Ayodhya Ramamandhir, Ayodhya Ram Mandir, Devotional News, Astrology in Telugu, Astrology Telugu.
Read more : ఈ ఏడు రాశుల జాతకులకు మాళవ్య రాజయోగం
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.