Ayodhya Rama Mandir PM Narendra Modi Special Fasting : హిందువుల ఆరాధ్య దైవం రాముడనే సంగతి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. ఒక కొడుకుగా.. అన్నగా.. మిత్రుడిగా.. భర్తగా.. పాలకుడిగా ఎలా ఉండాలో ఆయన్ని చూసి నేర్చుకోవచ్చు. ఆయన చూపిన మార్గం ప్రతీఒక్కరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది. అందుకే ప్రేతయుగానికి చెందిన రాముడిని నేటికి కూడా ప్రతీఒక్కరు దేవుడిని కొలుచుకుంటున్నారు.
రాముడి గుడిలేని ఊరు.. రాముడి ఫొటో లేని ఇల్లు.. రాముడిని తలుచుకోని హిందువులు ఉండదంటే అతిశయోక్తి కాదేమో. అంతలా రాముడు మన జీవితంలో మమేకం అయ్యాడు. అయితే రాముడి పుట్టిన అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం హిందువులు కొన్నేళ్లుగా పోరాటం చేయాల్సిన దుస్థితి నెలకొంది. అయితే ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాముడి దయతో అందరికీ కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది.
జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన..
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంచలనాత్మక పనులకు కేరాఫ్ గా నిలిచారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని వాటిని తన హయాంలో మోక్షం కల్పించారు. ఇలాంటి వాటిలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఒకటి. సుప్రీంకోర్టు అయోధ్యలో రామమందిర నిర్మాణంపై చారిత్రాత్మక తీర్పు ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది.
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అయోధ్య రామమందిర నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి. రామమందిర నిర్మాణానికి హిందువులు కోట్లాది రూపాయలు విరాళాలు ఇచ్చారు. కేంద్రం సైతం రామాలయ నిర్మాణానికి సహకారం అందించారు. ఈక్రమంలోనే ఈనెల 22న అయోధ్యలో చేపట్టిన నూతన రామ మందిరంలోని గర్భగుడిలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన చేపట్టనున్నారు.
ఈ మహోత్సవానికి మరో 11రోజులే సమయం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, యూపీ సర్కారు అయోధ్యలో అనేక అధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. దేశంలోని పురప్రముఖులకు, భక్తులకు ఇప్పటికే ఆహ్వానాలను పంపారు. అయోధ్య ఆహ్వాన పత్రిక, అంక్షితలను దేశంలోని ప్రతీ ఇంటికి చేరవేస్తూ రాముడి ఆశీస్సులు అందరికీ అందేలా చూస్తున్నారు.
ఈనెల 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామాలయ గర్భగృహంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగనుంది. ఇలాంటి నేపథ్యంలోనే నరేంద్ర మోదీ ప్రత్యేక అనుస్థానం(ఉపవాస) దీక్ష చేపట్టేందుకు సిద్ధమైయ్యారు. నేటి నుంచి 11రోజులపాటు ఆయన ఉపవాస దీక్ష అత్యంత నిష్ఠతో కొనసాగనుంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ దేశ ప్రజల మద్దతు తనకు కావాలని narendramodi.in సైట్‌లో కోరారు. ఆయన సందేశాన్ని విన్న దేశ ప్రజలకు నరేంద్ర మోదీకి పెద్దఎత్తున కామెంట్ల రూపంలో విషెస్ తెలియజేస్తున్నారు.
Keywords : Ayodhya, Ayodhya Ram Mandir, Ram Mandir, Jai Sri Ram, Ayodhya Ram Mandhir 2024, PM Narendra Modi, Narendra Modi Fasting, PM Modi.
Read more : పుట్టినతేది బట్టి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చా
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.