Makar Sankranti 2024 : ఈ ఏడాదిలో మకర సంక్రాంతి జనవరి 15న సోమవారం రోజున వచ్చింది. 14న భోగి పండుగ, 15న సంక్రాంతి పండుగ జరుగనుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాసీ తెలుగు భారతీయులు సంక్రాంతిని నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి సందడి మొదలైంది.
2024లో మకర సంక్రాంతిని జనవరి 14, 15 తేదిల్లో జరుపుకోనున్నారు. ఆదివారం రోజున సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన వెంటనే ఉత్తరాయణం ప్రారంభం కానుంది. మకర సంక్రాంతిని పురస్కరించుకొని నదీ స్నానం లేదా ఇంటి నీటిలో గంగాజలంతో స్నానం చేయడం ఉత్తమం. ఆ తర్వాత సూర్య భగవానుడిని ప్రార్థించాలి. స్నానం, పూజ అనంతరం కొన్ని వస్తువులను దానం చేయడం ద్వారా చాలా పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
గ్రహ బలం మరియు అదృష్టం కోసం ఈ సంక్రాంతి రోజు ఎలాంట వస్తువులు దానం చేయాలో ఈ కింది కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంక్రాంతి రోజున నువ్వులు, బెల్లం, దుప్పట్లు, నల్ల పప్పు, బియ్యం పప్పు, అన్నదానం చేయడం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయని పండితులు పేర్కొంటున్నారు.
సంక్రాంతి రోజున నల్ల నువ్వులు దానం చేయాలి. ఈ నువ్వులు అందుబాటులో లేనట్లయితే తెల్లనువ్వులు దానం చేయాలి. ఇలా చేయడం ద్వారా శని, సూర్య భగవానుడి దయ మనపై కలుగనుంది. ఐశ్వర్యం పెరుగనుంది.
గోల్డ్ ఫిష్ ఇంట్లో ఉంటే ఏం జరుగనుంది?
మకర సంక్రాంతి రోజున బెల్లం, నల్ల నువ్వుల లడ్డులను దానం చేస్తారు. వీటి దానం వల్ల సూర్యుడు, బృహస్పతి, శని దోషాలు తొలగిపోతాయి. దుప్పట్లను పేదలకు దానం చేయడం ద్వారం రాహు గ్రహానికి సంబంధిన దోషాలు తొలగి సానుకూల ఫలితాలు వస్తాయి. నల్ల పప్పు, బియ్యంతో చేసిన కిచిడి దానం చేయడం ద్వారా శని, గురు, బుధ గ్రహ దోషాలు తొలగిపోతాయి. వీటి వల్ల మీ విధి బలపడి చేపట్టిన కార్యాల్లో విజయం చేకూరుతుంది.
అన్నదానం చేయడం ద్వారా చంద్రదోషం తొలగిపోనుంది. దీని వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగనుంది. వీటిని కాకుండా మీ జాతర దోషాలు అనుసరించి కూడా వస్తువులను దానం చేయవచ్చు.
Read more : వాస్తు ప్రకారం.. నూతన దంపతులకు ఏ గది మంచిది?
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.