Medaram Jatara 2024 Special : మేడారం రూట్‌లో స్పెషల్ బస్సులు

Medaram Jatara 2024 Special Buses : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మేడారం జాతర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రెండేళ్లకొసారి జరిగే ఈ జాతరలో దేశంలోని నలుమూలల నుంచి భక్తులు పాల్గొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. 

Medaram Jatara 2024 Special

మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని మూడ్రోజుల పాటు మేడారం మహా జాతర వైభవంగా జరుగనుంది. ఆయా రోజుల్లో కోట్లాది మంది భక్తుల రద్దీ దృష్ట్యా సందర్శకులు నెలరోజుల ముందు నుంచే జాతరకు వచ్చి తమతమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో నెలరోజుల ముందు నుంచే మేడారం జాతర సందడి మొదలైంది. ఈ జాతరకు తెలంగాణతోపాటు ఆంధ్ర, చత్తీస్గడ్, ఒరిస్సా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కోటికి పైగా భక్తులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకోవడం విశేషంగా చెప్పచ్చు.

కాగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించింది. ఈ నేపథ్యంలోనే టీఎస్ఆర్టీసీ జాతర కోసం ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ కావడంతో వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనే అవకాశం కన్పిస్తోంది. దీంతో ఈసారి గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టీఎస్ఆర్టీసీ మేడారానికి నడుపుతున్న ప్రత్యేక బస్సు వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. !.

Medaram Jatara 2024 Special Bus Root

మేడారం జాతరకు ప్రత్యేకంగా టీఎస్ఆర్టీసీ బస్సులను నడిపించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. కొత్తగూడెం డిపో నుంచి 400ల ప్రత్యేక బస్సులను నడిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 18 నుంచి 25వ తేదీ వరకు మేడారానికి ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించారు. ఇతర డిపోల బస్సులను కూడా దిగుమతి చేసుకొని అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. 

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డిపోల నుంచి మేడారానికి ప్రత్యేక సర్వీసులు కొనసాగనున్నాయి. సత్తుపల్లి డిపో నుంచి వెంకటాపురం, ఏటూరునాగారం, చర్ల పరిధిలో 24 బస్సులు, మణుగూరు డిపో నుంచి మణుగూరు, మంగపేట, 20 బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. 

Medaram Jatara 2024 Special Bus From Warangal Depo

కొత్తగూడెం డిపో నుంచి కొత్తగూడెం, టేకులపల్లి నుంచి 155 బస్సులు, మధిర డిపో నుంచి పాల్వంచ, మదిర 35 బస్సులు, ఖమ్మం డిపో నుంచి ఖమ్మం, 128 బస్సులు, భద్రాచలం డిపో నుంచి 38 బస్సులు మేడారం జాతర కోసం ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.

Keywords : Medaram jatara 2024 Special Buses Timings | Medaram jatara 2024 Special Buses schedule | Medaram Jatara 2024 Dates |  Medaram jatara Date | Medaram Jatara Festival | Medaram jatara Distance | Medaram jatara Wikipedia | About Medaram jatara in telugu.


Read more : అయోధ్య రాముడి దర్శన వేళలు

Post a Comment

గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.