Wall Clock Vastu Tips : వాస్తు శాస్త్ర ప్రకారంగా ఇంట్లో గోడకు వేలాడే గడియారాలు ఉంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. గడియారాన్ని వాస్తు ప్రకారం ఉంచితే మంచి ఫలితాలుంటాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. వాటిని ఓసారి పరిశీలిద్దాం.
ప్రతి వ్యక్తి విజయంలో వాస్తు కీలక పాత్ర పోషిస్తుంది. పర్యావరణ దృక్కోణంలో, ఇంట్లో వస్తువులను ఉంచడం సైతం శుభ ఫలితాలు ఇస్తాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. ఇంట్లో ఏదైనా వస్తువు సరైన దిశలో ఉంచకపోతే, అది జీవితంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.
ఈ ఏడు రాశుల జాతకులకు మాళవ్య రాజయోగం
వాస్తు శాస్త్రం ప్రకారంగా.. ఇంటి ఉత్తరం లేదా తూర్పు గోడపై గడియారాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ దిశలో గడియారాన్ని ఉంచడం వల్ల ఇంటికి సానుకూల శక్తి వస్తుంది. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.'
ఇంట్లో మీ గడియారాన్ని దక్షిణానికి దిశలో సెట్ చేయవద్దు. వాస్తు శాస్త్రంలో గడియారాన్ని ఈ దిశలో అమర్చడం అశుభంగా పరిగణించబడుతుంది. విరిగిన గడియారాన్ని వాడకపోవడం మంచిది. గడియారాన్ని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించుకోవాలి. వాస్తు ప్రకారంగా ఇంట్లో ఎల్లప్పుడూ ఒక గుండ్రని గడియారాన్ని అమర్చాలి.
ఇంటి మెయిన్ డోర్ పైన ఎప్పుడూ గడియారాన్ని ఉంచకండి. అలాగే ఇంటి లోపల గడియారాన్ని ఎప్పుడూ ఆపే ప్రయత్నం చేయద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చెడిపోయిన గడియారాన్ని వేలాడదీయకూడదు. అలాగే వాచీలను, గడియాలను ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. గడియారాన్ని ఖచ్చితంగా నడిచేలా చేయండి. ముందుకు లేదా వెనుకకు కదలనివ్వద్దు.
Read more : పుట్టినతేది బట్టి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చా
Keywords : Wall clock, Large wall clock, Digital wall clock, Modern wall clock, Vintage wall clock, Unique wall clock, big wall clock, Astrology in Telugu, Astrology Telugu, Astrology House, Vastu Tips, Nemerology, తెలుగు జాతకం, ఆస్ట్రాలజీ తెలుగు.
Disclaimer : పై ఆర్టికల్ లో చెప్పబడిన విషయాలు జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. దీనిని ఆస్ట్రాలాలజీ తెలుగు నిర్ధారించడం లేదని గమనించగలరు.
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.