Astrology Rahu : జ్యోతిష్య శాస్ర ప్రకారంగా రాహు వల్ల చెడు ప్రభావం ఉండనుంది. 2024 సంవత్సరంలో రాహువు ఐదు రాశులకు చెందిన జాతకులపై ప్రభావం చూపే అవకాశముంది.
ఈ కారణంగా ఈ జాతకులు నష్టపోయే అవకాశముంది. రాహు మంత్రం లేదా జపం చేయడం వల్ల రాహు ఎఫెక్ట్ ను కొంతమేర తగ్గే అవకాశముంది. దీంతో ఏయే జాతకులపై రాహువు ప్రభావం చూపబోతున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
జాతకంలో రాహు స్థానం బట్టి కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. మీన రాశిలో రాహువు సంచారం కొంతమందికి కొత్త సవాళ్లను తీసుకొస్తుంది. రాహువు 2023 అక్టోబర్ 30న మీనరాశిలోకి ప్రవేశించి 2025 వరకు అక్కడే ఉండనున్నాడు.
అస్ట్రాలజీ ప్రకారం రాహువు భయం, భౌతికవాదం, గందరగోళం, ముట్టడి మరియు దురదృష్టాన్ని కలుగజేస్తాడు. రాహువు జాతకంలో అశుభ స్థానం కలిగి ఉండటం వల్ల ప్రతి రాశిపై కొన్ని ప్రతికూల ప్రభావాలను చూపుతాడు. అయితే ఎల్లప్పుడు ప్రతికూలంగా ఉండడు.
జాతకంలో రాహు ప్రభావం వల్ల సోమరితనం, పనుల్లో ఆటంకాలు, ఆకస్మిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు, అయోమయ మనస్సు, అతిగా ఆలోచించడం, చెడు అలవాట్లకు లోనవడం, అనవసర ఖర్చులు, ధన నష్టం వంటి సమస్యలు ఎదురుకానున్నాయి. 2024లో ధనస్సు, మకరం, మేషం, సింహ, కన్య రాశి జాతకులపై రాశు ప్రభావం ఉండనుంది.
- ధనస్సు రాశి : ఈ ధనస్సు రాశి వారికి రాహు ప్రభావం కఠినంగా ఉండనుంది. రాహువు మీ నాల్గవ ఇంటిని బదిలీ చేస్తాడు. దీని వల్ల పలు సమస్యలు కలుగుతాయి. ఇది మీ భాగస్వామ్య, స్నేహితులు మరియు ఒప్పందాలతో సమస్యలను తేనుంది. మీ ప్రయత్నాలకు ఆటంకం కలిగించవచ్చును. ప్రేమ జీవితంలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. అవగాహన లేకపోవడం వల్ల సంబంధంలో చీలిక ఏర్పడనుంది.
- మకరం : 2024లో మకర రాశి వారికి రాహు ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పనుల్లో అడ్డంకులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ప్రధానంగా కాళ్ల నొప్పులు, కాలు తిమ్మిర్లు వస్తాయి. డబ్బు ఖర్చు చేసే అవకాశముంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
- మేషం : మేష రాశి జాతకులకు రాహు ప్రభావం వల్ల సమస్యలు రావచ్చు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఇంట్లో సమస్యలు వస్తాయి. ఇంటిని నిర్మించడానికి లేదా మరమ్మతుల కోసం అదనపు డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది.
- సింహం : సింహ రాశి జాతకులు రాహు ప్రభావంతో కుటుంబ కలహాలు ఎదుర్కోవచ్చు. ఆర్థిక సమస్యలు, ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశముంది. వీటిని ఎదుర్కోవడం అసాధ్యమవుతుంది.
- కన్య : రాహువు ప్రభావంతో కన్య రాశి జాతకులకు ఆర్థికంగా నష్టపోయే అవకాశముంది. కుటుంబంలో విబేధాలు తలెత్తే అవకాశముంది. కంటి, పంటి నొప్పి సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయాణ సమయాల్లో అజాగ్రత్తగా ఉండొద్దు.
రాహు బీజ మంత్రం :
Rahumantra : ఓం భ్రాం భ్రీం భ్రౌం సంహ రాహ్వే నమః ||
- రాహు బీజ మంత్రాన్ని జపించడంలో మీరు ఎంత అంకితభావంతో ఉంటే అంతే మంచి ఫలితాలు ఉంటాయి.
- మంత్రాన్ని జపించడంలో అపారమైన సంకల్పం ఉండాలి. కనీసం 21 రోజులు ప్రతిరోజూ దీన్ని అనుసరించాలి.
- రాహు బీజ మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపించడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి.
- మీరు రాహు బీజ్ మంత్రాన్ని జపించడానికి ముందు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయగలిగితే, చేయండి. ఇది మీకు మరింత శక్తిని ఇస్తుంది.
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.