Color Astrology Tips : దైనందిన జీవితంలో ప్రతీ రంగుకు ఓ ప్రత్యేకత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా వారంలో కొన్ని రంగుల దుస్తులను ధరించడం వల్ల మనకు శుభ ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఆకాశంలో ఏడు రంగుల ఇంద్ర ధనస్సును చూస్తే మనకు ఎంత హాయిగా అన్పిస్తుందో.. అలాగే ఆయా రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన రంగులు కలిగిన దుస్తులను ధరించడం ద్వారా కూడా మన జీవితంలో ‘హరివిల్లు’ లాంటి సంతోషం కలుగుతాయని నమ్ముతుంటారు.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఆదివారం నుంచి శనివారం వరకు ఆయా రోజుల్లో ఎలాంటి రంగులు ఉన్న దుస్తులు ధరిస్తే మనకు శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఆదివారం (Sunday Color Astrology ) కాలభైరవుడు, సూర్యుడికి అంకితం చేయబడింది. ఈరోజున గులాబీ, బంగారు, నారింజ , ఎరుపు రంగుల దుస్తులను ధరించడం మంచిది. మన జీవితంలో గౌరవం, కీర్తి ప్రతిష్టల కోసం గులాబీ లేదా బంగారు రంగు దుస్తులను ధరించడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
సోమవారం (Monday Color Astrology) చంద్ర దేవుడు, మహాదేవుడికి ప్రతీకరమైన రోజు. ఈరోజున శివుడి ప్రసన్నం చేసుకునేందుకు తెల్లని వస్త్రాలు ధరించండం మంచిది. తెలుపు వర్ణం మనస్సు ఏకాగ్రత మరియు శాంతిని పెంపొదిస్తుంది.
మంగళవారం (Tues Day Color Astrology ) హనుమంతుడికి ఇష్టమైన రోజు. అలాగే మార్స్ ఈ రోజును పాలించే గ్రహం. మార్స్ ఎరుపు మరియు నారింజ రంగులను సూచిస్తుంది. ఎరుపు రంగు ఆనందం మరియు శ్రేయస్సు చిహ్నం. కావున మంగళవారం నాడు ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులను ధరించడం మంచిది.
బుధవారం (Wends Day Color Astrology ) గణపతికి ప్రీతికరమైన రోజు. ఈరోజున బుధగ్రహం పాలిస్తుంది. ఈ రోజున ఆకు పచ్చని బట్టలు ధరించడం వల్ల బుధగ్రహం అనుగ్రహం లభిస్తుంది. ఆకుపచ్చ అనేది ఆనందం, శ్రేయస్సు, ప్రేమ, దయ, స్వచ్ఛతకు చిహ్నం.
గురువారం (Thus Day Color Astrology ) శ్రీ మహావిష్ణువు, దేవగురువు బృహస్పతికి ఇష్టమైన రోజు. బృహస్పతి(గురుగ్రహం)ని సంపద, జ్ఞానం, సంపద మరియు పిల్లల కారకంగా పరిగణిస్తారు. తెలుపు తో కలిసిన పసుపు రంగు బృహస్పతికి ఎక్కువ ఇష్టం. తెలుపుతో కలిసిన పసుపు రంగు అనేది అందాన్ని మరియు ఆధ్యాత్మిక తేజస్సును పెంపొందిస్తుంది. ఈ రోజున పసుపు బట్టలు ధరించిస్తే బృహస్పతి ఆనందిస్తాడు.
శుక్రవారం (Friday Color Astrology ) దుర్గా, లక్ష్మీ మరియు ఇతర దేవతలకు అంకితం చేయబడింది. ఈరోజును శుక్రగ్రహం పాలిస్తుంది. దేవతలు సైతం ఈరోజున ఎరుపు రంగు దుస్తులు ధరిస్తారు. శుక్రవారం రోజున ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే అలసట తొలగిపోవడంతోపాటు శారీరక ఆనందం పెంపొందుతాయి.
శనివారం (Saturday Color Astrology ) న్యాయ దేవుడైన శనికి ప్రతీకరమైన రోజు. ఈరోజున నలుపు, నీలం, ముదురు గోధుమ రంగు తదితర రంగుల దుస్తులు ధరించడం మంచిది. శనివారం రోజున ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు.
Read more : అయోధ్య రాముడి దర్శన వేళలు
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.