- లింగ అంటే అర్థం ఏమిటీ?
- మహా శివరాత్రి రోజున లింగాన్ని పూజిస్తే ఏం జరుగుతుంది?
- లింగ అంటే అర్థం ఏమిటీ?
- మహా శివరాత్రి రోజున లింగాన్ని పూజిస్తే ఏం జరుగుతుంది?
Maha Shivratri 2024 Date and Time : ప్రతియేటా ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహా శివరాత్రిని జరుపుకోవడం ఆనవాయితీ వస్తుంది. శైవ, శివ భక్తులకు ఈరోజు చాలా ప్రత్యేకమైనది. 2024 సంవత్సరంలో మార్చి 8వ తేదిన మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తులు ఘనంగా జరుపుకోనున్నారు. ఈరోజున పూజలు, ఉపావనం, జాగరణ చేస్తారు. మహా శివరాత్రి నాడు ఉపవాసం ఉండి శివ లింగాన్ని పూజించడం పరమశివుడు ప్రసన్నమవుతాడు. ఆయన కృప కారణంగా వారికి మేలు కలుగుతుందని భక్తులు విశ్వాసిస్తుంటారు.
మహా శివరాత్రి పర్వదినం వెనుక పురాణాలలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈరోజునే శివ పార్వతుల కళ్యాణం జరిగింది. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం ఏర్పడినప్పుడు ఆ మహాదేవుడు లింగ రూపంలో ఉద్భవించి దానిని ఆపినట్లు పురాణాల్లో చెప్పబడింది. ఈ శివలింగాన్ని బ్రహ్మ, విష్ణువులు తొలిసారి పూజించారని పురాణాల్లో పేర్కొనబడింది. వీటితోపాటు అనేక కథలు సైతం ప్రచారం ఉన్నాయి.
- లింగం అంటే అర్థం ఏమిటీ?
మహా శివరాత్రికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున శివుడి ప్రతిరూపమైన లింగాన్ని పూజిస్తే మన కష్టాలకు విముక్తి లభిస్తుంది. ఈ రోజున భక్తులు శివ లింగానికి తప్పకుండా పూజలు, అభిషేకాలు చేస్తారు. అసలు మహా శివరాత్రికి, లింగానికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
సంస్కృతంలో ‘లింగ’ అనే పదాన్ని సంకేతం లేదా గుర్తు అని అర్థం. కాబట్టి శివలింగం అంటే శివుని గుర్తు లేదా చిహ్నం. పురాణాల ప్రకారం.. మహా శివరాత్రి రోజునే శివలింగం ఉద్భవించింది. శివ లింగం నిరాకారమైనది, అనంతమైన స్వరూపంగా చెబుతారు. దీనికి ప్రారంభం మరియు అంతం లేదని నమ్ముతారు. శివుడు నిర్గుణుడు.. నిరాకారుడు.. సాకార మూర్తి. శివ-శక్తి కలయిక ఆత్మ మరియు మనస్సు యొక్క ఐక్యతను సూచిస్తుంది.
- శివ లింగాన్ని పూజిస్తే ఏం జరుగుతుంది?
శివ లింగ వైభవం వేదాలు, శివ పురాణం, లింగ పురాణం, స్కంద పురాణం, కూర్మ పురాణం, వాయు పురాణం తదితర అనేక పురాతన గ్రంథాల్లో పేర్కొనబడింది. శివలింగం సృష్టి, సంరక్షణ మరియు విధ్వంసం అనే మూడు ప్రాథమిక శక్తులను కలిగి ఉంటుంది. మహా శివరాత్రి రోజున భక్తులు ఎవరైనా నిర్మలమైన మనస్సుతో శివ లింగాన్ని పూజించడం లేదా అభిషేకించడం వల్ల కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయట. అదృష్టంతోపాటు విశేష యోగ ఫలాలు భక్తులకు కలుగుతాయని భక్తులు నమ్ముతుంటారు.
శివరాత్రి ముందు కలలో ఇవి కన్పిస్తే శుభయోగం
Keywords : Maha Shivratri 2024 Special, Maha Shivratri 2024, Maha Shivratri 2024 Date, Maha Shivratri 2024 Time, Maha Shivratri 2024 Muhurtham, Maha Shivratri 2024 Tidhi.
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.