Mauni Amavasya Tithi 2024 : మౌని అమావాస్య వీరికి అదృష్ట యోగం!

Mauni Amavasya Tithi : 2024 ఫిబ్రవరి 9న మౌని అమావాస్య రాబోతుంది. ఈరోజున కొన్ని రాశుల వారికి అదృష్ట యోగం పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 12 రాశులలో ఆరు రాశులకు చెందిన జాతకులకు మౌని అమావాస్య రోజున శుభ ఫలితాలు రాబోతున్నాయి.

ప్రేమలో విజయం సాధించడం లేదా కొత్త భాగస్వామి వీరి జీవితంలోకి రావడం జరిగే అవకాశముంది. ఉద్యోగం లేదా పదోన్నతి లభించవచ్చు. ఆదాయం పెరుగుదల వంటి శుభవార్తలు మౌని అమావాస్య రోజున ఉండబోతున్నాయి. 

Mauni Amavasya Tithi

ఈ ఆరు రాశులలో మేష రాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీన రాశి జాతకులు ఉన్నారు. ముందుగా మేష రాశి విషయానికొస్తే.. మీ తల్లిదండ్రులతో సత్ససంబంధాలు నెలకొంటాయి. మీ ప్రధాన ప్రాజెక్ట్‌లలో ఒకటి విజయవంతం అయ్యే అవకాశముంది. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశముంది. పని చేసే చోట పై అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. ఇది సంతోషకరమైన ఫలితాలకు దారి తీస్తుంది. మీ స్థానం మరియు ప్రభావం మరింత పెరగవచ్చు.

వృషభ రాశి విషయానికొస్తే.. మౌని అమావాస్య (Mauni Amavasya) రోజున వీరికి విదేశాలకు వెళ్లే అవకాశాలు రావచ్చు. మరిన్ని శుభవార్తలను వింటారు. వ్యాపారంలో నిమగ్నమైన వారికి లాభాలు వస్తాయి. నూతన పనులకు శ్రీకారం చుడుతారు. ఇది మీకు భారీ ఆర్థిక లాభాలను తెచ్చి పెడుతుంది. తీర్థయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.

Medaram Jatara 2024 Special : మేడారం రూట్‌లో స్పెషల్ బస్సులు

కర్కాటక రాశి.. వీరి హృదయాలు ప్రేమతో నిండి వుంటాయి. ఒకరిపట్ల ఆకర్షితులు అవుతారు. కొత్త భాగస్వామిని కనుగొంటారు. కొత్త కారు, బట్టలు, ఆభరణాలు మొదలైనవి కొనుగోలు చేసే అవకాశముంది. వ్యాపారాన్ని విస్తరించేందుకు పెట్టుబడి సమకూరే అవకాశముంది. భాగస్వామ్య వ్యాపారంలో పురోగతి దక్కుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది.

Mauni Amavasya Date, Astrology in Telugu

వృశ్చిక రాశి.. మౌని అమావాస్య (Mauni Amavasya Date) రోజున ఈ జాతకులకు పురోగతి లభిస్తుంది. ఈరోజు అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆధ్యాతిక్మం పట్ల ఆసక్తి కలుగుతుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశముంది. ఈ రోజు మీకు ఆహ్లాదరంగా గడుస్తుంది.   

మకర రాశి : ఈరోజున ఈ జాతకులకు కెరీర్ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం దక్కుతుంది. సాలరీ పెరుగుదల ఉండవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలో పెడుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయడం మంచిది. మౌని అమావాస్య రోజున మీరు చేపట్టే పనులు విజయవంతం అవుతాయి. ఆటంకాలు తొలిగిపోతాయి. 

Mauni Amavasya, Astrology Telugu

మీన రాశి జాతకులకు మౌని అమావాస్య నాడు వివాహనికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారం, ఉద్యోగులకు ధనలాభం కలిగవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  ఆదాయం పెరగడంతో సంతోషం, సౌకర్యాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. మీతో స్నేహం చేసేందుకు అందరూ ఆసక్తిని కనబరుస్తారు.

Mauni Amavasya Donate Items

మౌని అమావాస్య (Mauni Amavasya Day ) నాడు వీటిని దానం చేస్తే ధనలాభం..

2024లో ఫిబ్రవరి 9న మౌని అమావాస్య రానుంది. హిందూ మతంలో మౌని అమావాస్య తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజున పవిత్ర నదిలో స్నానం చేసి, పేదలకు దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని, మన పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో మౌని అమావాస్య రోజున (Mauni Amavasya Donate Items )ఎలాంటి దానం చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!

Mauni Amavasya Donate Items Brahman Boy, Buddisam Boy



  • ధాన్యం : మౌని అమావాస్య రోజున స్నానం ఆచారించిన తర్వాత బ్రాహ్మణుడికి ధాన్యాన్ని దానం చేయాలి. దీని వల్ల ఇహలోక యాత్రలో ఉన్న మన పూర్వీకులు ఈ ఆహారాన్ని పొందుతారట. దీంతో వారు సంతృప్తి చెందుతారని నమ్ముతారు.
  • దుప్పటి : ఈ రోజున దుప్పటి దానం చేయడం మంచిది.  దీని వల్ల గ్రహాల ప్రభావం తగ్గుతుందట. పూర్వీకుల మోక్షానికి సైతం దుప్పటి దానం సహాయపడుతుంది. దీంతో వారు సంతోషించి ఆశీర్వదిస్తారు. 
  • పంచదార : మౌని అమావాస్య రోజున పంచదార దానం చేయడం వల్ల పూర్వీకులకు తీపి రుచిని కలుగుతుందట. తద్వారా వారు సంతోషించి మనకు శుభ ఫలితాలు కలుగజేస్తారు. ఈ దానంతో ఇంటి ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయి. 
  • ఆవుపాలు : ఆవు పాలను దానం చేయడం ద్వారా మన పూర్వీకులు మోక్షాన్ని పొంది సంతృప్తి చెందుతారట. ఆవు పాలను దానం చేయడం వల్ల దేవతలు సైతం సంతోషిస్తారు. 
  • ఆవనూనె : ఆవనూనెను అవసరమైన వారికి దానం చేస్తే పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది. దీని వల్ల జీవితంలో ఆనందం లభిస్తుంది. ఈ రోజున ఆవనూనెతో పాటు నువ్వులనూనె, అన్నం, జామకాయ దానం చేయడం సైతం శుభప్రదంగా చెప్పబడింది.
  • దక్షిణ : ఈరోజున ఏదైనా వస్తువు దానం చేసిన తర్వాత బ్రాహ్మణుడు మన సామర్థ్యం మేరకు దక్షిణ సమర్పించాలి. ఈ విరాళం తర్వాతే అన్ని దానాలు సంపూర్ణంగా పరిగణిస్తారట. ఈ దానాలు చేయడం ద్వారా మన పూర్వీకులు సంతోషించి తమ వారసులకు సంపదలు ప్రసాదిస్తారని హిందువులు నమ్ముతుంటారు.

Keywords : Mauni Amavasya 2024, Mauni Amavasya 2024 Date, Mauni Amavasya 2024 kab hai, Mauni Amavasya tithi, Mauni Amavasya 2024 Date and Time, Mauni Amavasya February, Mauni Amavasya Tithi Time, Astrology in Telugu, Telugu Jatakam, Mouni Amavasya Day Donated Items.


Read more : పుట్టినతేది బట్టి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చా

అయోధ్య రాముడి దర్శన వేళలు

Post a Comment

గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.