ఈరోజు రుద్రాభిషేకం చేయడం వల్ల శివుడు త్వరగా ప్రసన్నం అవుతాడు. ఉపవాసం, జాగరణ, పూజలు, శివనామ స్మరణ వల్ల శివుడి అనుగ్రహం కలుగనుంది.
ఇక మహా శివరాత్రి (Maha Shivarathri 2024) కి ముందు వచ్చే కొన్ని కలలు అద్భుత ఫలితాలను కలుగజేస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వీటిని సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొండటంతోపాటు వచ్చే ప్రమాదాలను దూరం చేసుకోవచ్చు.
అభిషేకం : మహా శివరాత్రికి ముందు కలలో శివలింగానికి అభిషేకం చేసినట్టుగా కల వస్తే.. ఆ మహాదేవుడు ప్రసన్నుడై ఆ వ్యక్తికి ఉన్న కష్టాలను త్వరగా తొలగిస్తాడని అర్థం. ఈ కల మన జీవితంలోకి ఆనందాన్ని తీసుకురానుంది.
రుద్రాక్ష: మహాశివరాత్రి (Maha Shivarathri 2024) కి ముందు కలలో రుద్రాక్ష కనిపించడం అన్నివిధలా శుభప్రదం. రుద్రాక్ష కలలో కన్పిస్తే మీకున్న బాధలు, వ్యాధులు, లోపాలు తొలగిపోతాయి. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తవుతాయని సూచన.
బిల్వ : శివరాత్రి (Shivarathri 2024) కి ముందు కలలో బిల్వ ఆకులు, బిల్వ చెట్టు కనిపిస్తే ఆర్థిక సమస్యలు తీరుతాయని అర్థం. ఇలాంటి కల వస్తే మీకున్న అన్ని సమస్యలు త్వరలో ముగిసిపోతాయని సూచన.
నల్లని శివలింగం : శివ రాత్రికి ముందు నల్లని శివలింగం కలలో కనిపిస్తే మీ పనిలో మీకు పదోన్నతి లభిస్తుందని అర్థం.
నంది : శివరాత్రికి ముందు లేదా శివరాత్రి సమయంలోనంది కలలో కన్పిస్తే ఆ మహాదేవుడి అనుగ్రహం మీకు లభిస్తుందని అర్థం. నంది కలలో కన్పించడం మీకు విజయాన్ని సూచిస్తుంది.
పాము : శివరాత్రికి ముందు పాము లేదా పాముల గూళ్ళను కలలో కన్పిస్తే.. మీ శ్రేయస్సు.. సంపదకు చిహ్నంగా పరిగణిస్తారు.
త్రిశూలం : మహా శివరాత్రి సమయంలో శివుడి త్రిశూలం కలలో కన్పిస్తే.. మీ కష్టాలన్నింటినీ తీరుతాయని అర్థం. శివుడు త్రిశూలానికి (ట్రైడెంట్‌కు) మూడు అంచులు ఉన్నాయి. అవి కామం.. కోపం.. దురాశలను సూచిస్తాయి. శివుడు త్రిశూలం కలలో కన్పిస్తే మీ కష్టాలన్నీ ఆ మహాదేవుడు నాశనం చేయబోతున్నాడని సూచన.
Read more : అయోధ్య రాముడి దర్శన వేళలు
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.