Valentine’s Day 2024 Special Horoscopes : ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే (ప్రేమికుల దినోత్సవం)గా జరుపుకుంటారు. ఈ రోజు కొన్ని జంటలు తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు ఆసక్తిని కనబరుస్తుంటారు. రిలేషన్స్ లో ఉన్నవారు వాలంటైన్స్ డేను సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు.
కాగా మరోవైపు వాలెంటైన్స్ నెలలో కొన్ని రాశుల వారికి ప్రేమలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కన్పిస్తోంది. కొన్ని జంటలకు పొంతన కుదరకపోవడంతో ఈనెలలో ఒకింత నిరుత్సాహానికి గురయ్యే అవకాశముంది. ఆ జంటలెవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
2024 Valentine's Day Horoscopes :
- మేషం-కర్కాటకం : మేష రాశి జాతకులు ఆవేశపూరిత, ఇంపల్సివ్ నేచర్‌కి చెందుతారు. వీరు భావోద్వేగ, సున్నితమైన కర్కాటక రాశితో గొడవపడే అవకాశముంది. మేషం అనుకోకుండా కర్కాటక రాశి జాతకుల మనో భావాలను దెబ్బతీయవచ్చు. ఇది అపార్థాలకు దారి తీసే అవకాశముంది.
- వృషభం-కుంభం : వృషభ రాశి జాతకులు స్థిరత్వం, సంప్రదాయానికి విలువనిస్తారు. ఎక్కువ స్వేచ్ఛాయుతమైన కుంభరాశితో కనెక్ట్ అవ్వడం వీరికి సవాలుగా మారుతుంది. జీవితానికి సంబంధించిన విషయాలను అర్థం చేసుకునేందుకు వీరు కష్టపడాల్సి వస్తుంది.
- మిథునం-కన్య : మిథున రాశి వారు స్పాంటేనిటీకి కేరాఫ్. కన్యారాశి నిర్మాణాత్మక జీవనశైలికి కేరాఫ్. మిథున రాశి వారు కన్య రాశి అవసరాలతో విభేదించవచ్చు. వీరువురి మధ్య మారుతున్న ఆసక్తులను సమతుల్యం పర్చడం, ప్రేమను వ్యక్తం చేయడం సవాళ్లతో కూడుకుంటుంది.
- కర్కాటక- కుంభం : కర్కాటకం భావోద్వేగాలు.. కుంభం డిటాచ్‌డ్ నేచర్‌తో అంతగా కలిసే సూచనలు లేవు. స్పేస్ కోరుకునే కుంభ రాశి వారికి.. సాన్నిహిత్యం ఆశించే కర్కాటక రాశికి మధ్య కనెక్షన్ కుదరే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
- సింహం-వృశ్చిక : సింహ రాశి జాతకులు అవుట్‌గోయింగ్ నేచర్.. వృశ్చికం తీవ్రమైన స్వభావంతో విభేదించే అవకాశాలున్నాయి. ఈ ఇరువురి మధ్య ప్రేమను వ్యక్తపర్చడంలో, స్వీకరించడంలో చాలా తేడాలు ఉంటాయి. ఇది వీరిమధ్య విబేధాలకు దారితీయవచ్చు.
- కన్య-ధనస్సు : కన్యా రాశి ప్రాక్టికాలిటీతో.. అడ్వెంచర్‌ని ప్రేమించే ధనుస్సు రాశి వారితో విభేదించవచ్చు. స్థిరత్వం మరియు అన్వేషణ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం వీరికి సవాలుగా మారే అవకాశముంది.
- తుల-మకరం : సామరస్యం కోరుకునే తులా రాశి వారికి.. మకరం తీవ్రమైన విధానానికి సర్దుబాటు కాకపోవచ్చు. బ్యాలెన్స్ మరియు ఆశయం మధ్య అంతరాన్ని తగ్గించుకునేందుకు వీరిమధ్య అదనపు సమయం కావాల్సి రావొచ్చు.
- వృశ్చికం-కుంభం : వృశ్చిక రాశి తీవ్రతకు మరియు స్వేచ్ఛను కోరుకునే కుంభ రాశి వారికి స్వభావ రీత్యం విరుద్ధంగా ఉండొచ్చు. స్వేచ్ఛను గౌరవించేటప్పుడు మరియు భావోద్వేగ సమయంలో వీరిమధ్య సవాళ్లు ఎదురు కావొచ్చు.
Ayodhya Ram Temple Timings : అయోధ్య రాముడి దర్శన వేళలు
- ధనుస్సు-మీనం: స్వేచ్ఛను కోరుకునే ధనుస్సు రాశి వారికి.. సున్నితమైన స్వభావం కలిగిన మీన రాశి వారితో విభేదించవచ్చు. ఎమోషనల్ కనెక్షన్‌తో బ్యాలెన్సింగ్ అడ్వెంచర్‌ను వీరు జాగ్రత్తగా నడుచు కోవాల్సి ఉంటుంది.
- మకరం-మేషం : మకర రాశి జాతకుల క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన మేష రాశి వారికి ఉద్రేకతతో విభేదించే అవకాశముంది. వాలెంటైన్స్ డే సందర్భంలో ప్రాక్టికాలిటీని, స్పాంటేనిటీతో బ్యాలెన్స్ చేయడం సవాళ్లతో కూడుకొని ఉండే అవకాశముంది. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Read more : పుట్టినతేది బట్టి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చా
Keywords : Valentine’s Day 2024 Special Horoscopes | Valentine’s Day 2024 | 2024 Valentine’s Day | Valentine’s Day 2024 Special | 2024 Valentine’s Day Special | Valentine Day 2024 | Telugu Horoscope | Astrology in Telugu | Astrology Telugu.
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.