Aquarium Vastu for Home : అక్వేరియంతో కలిగే లాభ, నష్టాలేంటీ?

Aquarium Vastu for Home : చాలామంది తమతమ ఇళ్లలో అక్వేరియంలను ఏర్పాటు చేసుకుంటారు. వీటి వల్ల ఇంటికి అందంతోపాటు వారికి మానసికోల్లాసం కలుగుతుంది. అయితే వాస్తు శాస్త్రంలో ఇంట్లో ఉండే అక్వేరియంకు చాలా ప్రత్యేకత ఉందని చెప్పబడింది. అక్వేరియం వల్ల ఇంట్లో శుభ మరియు సానుకూల శక్తిని తీసుకొస్తుందని, నెగిటీవ్ ఎనర్జీని బయటికి పోయేలా చేస్తుందని నమ్ముతారు. 

Aquarium Vastu for Home

చేపలను నీటి మూలంగాను, కేతువు యొక్క కారణజన్ములుగా చెబుతుంటారు. చేపలు మన చుట్టుపక్కల ఉంటే సోమరితనం, ప్రతికూల శక్తి తొలగిపోతుందని భావిస్తున్నారు. ఈ కారణంగానే చాలామంది తమ ఇళ్ళల్లో అక్వేరియంలను అలంకరణ ప్రాయంగానే కాకుండానే వాస్తు ప్రకారంగా ఏర్పాటు చేసుకుంటారని తెలుస్తోంది. 

ఇకపోతే అక్వేరియంలను మన ఇంట్లో ఏ దిశలో ఏర్పాటు చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? అనేవి తెలుకోవడం ద్వారా ఇంట్లో ఉండే నెగిటీవ్ ఎనర్జీని దూరం చేసుకోవచ్చు. ఈ కథనంలో అలాంటి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!

aquarium as per vastu

వాస్తు శాస్త్రంతోపాటు ఫెంగ్ షుయ్ నియమాల ప్రకారంగా..  

  • బెడ్రూం మరియు కిచెన్లో అక్వేరియంలను ఉంచడం మానుకోవాలి. ఇలాచేస్తే ఇంట్లో నివసించే వారికి నిద్రకు లేదా ఆహారం తీసుకోవడంలో పలు సమస్యలను కలుగజేస్తుంది. 
  • కిచెన్లో అక్వేరియం ఉండం వల్ల కుటుంబీకుల మధ్యలో వివాదాలు వచ్చే అవకాశముంది. 
  • ఇంటి మధ్యలో ఉన్న అక్వేరియంల వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. 
  • ఇంటి దక్షిణ దిశలో అక్వేరియం ఉండటం వల్ల సంపదను కోల్పోయే అవకాశముంది. 
  • అలాగే అక్వేరియంను మెట్ల కింద కూడా ఉంచవద్దు. 
  • ఆగ్నేయ దిశలో పెట్టకూడదు. ఈ దిశ అగ్ని మూలకాన్ని సూచింబడింది. ఇది వాస్తు దోషాలను కలుగజేస్తుంది. 

ఆహ్లాదంతోపాటు సానుకూల ఫలితాలు..

అక్వేరియంలు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఆందోళన మరియు ఒత్తిడులను తగ్గిస్తాయి. అక్వేరియంలో చేపలతోపాటు అందమైన పువ్వులు పెట్టడం వల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయి. అక్వేరియంలో చేపల సంఖ్య కూడా ముఖ్యమైనది. చేపలు సరైన సంఖ్యలో ఉంటే కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతుంటారు. 

fish tank vastu shastra, Number of Fish in aquarium

  • ఎన్ని చేపలను ఉంచాలి..

అక్వేరియంలో కనీసం తొమ్మిది చేపలను ఉంచాలి. ఎనిమిది చేపలు ఎరుపు, బంగారు రంగు, ఒక చేప నల్లగా ఉండాలనే నియమం సైతం ఉంది. ఈ నియమానికి మించి ఇతర చేపలను జోడించినట్లయితే కుటుంబంలో ఇబ్బందులు కలుగుతాయట. అందువల్ల మీరు సరైన సంఖ్యలో చేపలను ఉంచుకోవడం మంచిది.

  • అక్వేరియంను తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచాలి. దీని వల్ల మీ జీవితంలో చాలా ప్రయోజనాలు కలుగుతాయి. 
  • ఇంటి సభ్యుల మధ్య పరస్పర ప్రేమను కొనసాగించడానికి అక్వేరియంను ప్రధాన ద్వారం యొక్క ఎడమ వైపున ఉంచాలి.
  • దీని వల్ల మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అప్పుల సమస్యలు పరిష్కారం అవుతాయి. 
  • అక్వేరియంలో నల్ల చేపలను కూడా ఉంచుకోవాలి. నల్ల చేపలు చనిపోతే అవి మీ సమస్యలను దూరం చేస్తాయని ఫెంగ్ షుయ్ శాస్త్రంలో చెప్పబడింది. 

ఏదిఏమైనా అక్వేరియంను ఇంట్లో ఏర్పాటు చేసుకున్నట్లయితే సరైన నియమాలను పాటించినట్లయితే సమస్యలకు దూరంగా ఉండటంతోపాటు సానుకూల ఫలితాలను పొందవచ్చని తెలుస్తోంది. 

గమనిక : ఈ సమాచారం మత విశ్వాసాలు, ఇంటర్నెట్లో దొరికి సమాచారం మేరకు అందించడం జరుగుతుంది. వీటిని Astrologytelugu.com ధృవీకరించడం లేదు.

Keywords : Aquarium Vastu for Home, Aquarium Vastu, Aquarium and Vastu, Aquarium as per Vastu, Aquarium Fish Vastu, Fish tank as per Vastu, Fish tank Vastu, Fish tank Vastu shastra, Aquarium vastu home, Best direction for aquarium, Astrology Telugu,తెలుగు జాతకం.


Daily Updates రోజు వారీ, వారానికి సంబంధించిన రాశి ఫలాలు, జ్యోతిష్య సంబంధించిన కథనాల కోసం Astrologytelugu.com వెబ్ సైట్ ను క్లిక్ చేయండి. 

తాజా సినిమాల పాటలు, భక్తి పాటలు, జానపద పాటల కోసం www.lyricss.co.in వెబ్ సైట్ ను సందర్శించండి.

ఆర్టికల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ప్లీజ్ డోంట్ అబ్యూస్ వర్డ్స్. ఈ కథనం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు దీనిని షేర్ చేయండి. ధన్యవాదాలు.

Post a Comment

గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.