Holi Festival 2024 and Lunar eclipse 2024 : ఈ ఏడాదిలో మార్చి 25వ తేదిన హోలీ పండుగను జరుపుకోనున్నారు. ఈ హోలీ రోజున చంద్రగ్రహణం (Chandra Grahan) ఏర్పడనుంది. ఉదయం 10 గంటల 23 నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు ఉండనుంది.
అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావం భారత్ లో కన్పించకపోవడం ఒకరకంగా శుభవార్తనే చెప్పొచ్చు. ఈ చంద్ర గ్రహానానికి సుతక్ కాలం వర్తించదు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా మరో వందేళ్ల తర్వాత హోలీ పండుగ రోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది.
హోలీ పండుగను హిందువులకు ప్రత్యకమైనది. ఉత్తరాదితోపాటు దక్షిణాది ప్రజలు ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ సంవత్సరం హోలీ, హోలికా దహన్ దేశవ్యాప్తంగా జరుపుకోవడం ఆచారంగా వస్తోంది.
ఫాల్గుగ మాసం ఫౌర్ణమి రోజు రాత్రి హోలికా దహన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీ పండుగను హిందువులు ప్రేమ, సౌభ్రాతృత్వానికి సూచికగా భావిస్తారు.
హోలీ 2024 రోజున ఏర్పడబోతున్న చంద్రగ్రహణం కారణంగా కొన్ని రాశులకు శుభయోగాలు కలుగబోతుండగా మరికొన్ని జాతకులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.
2024 హోలీ తర్వాతి నుంచి మూడు రాశులకు చెందిన జాతకులకు శుభయోగాలు కలుగనున్నాయని పండితులు చెబుతున్నారు. మొత్తం 12 రాశులలో మేష, తులా, కుంభ రాశి జాతకులకు హోలీ చంద్ర గ్రహణం తర్వాత శుభ ఫలితాలు రాబోతున్నాయి.
- మేష రాశి : హోలీ చంద్రగ్రహణం కారణంగా మేషరాశి జాతకులకు శుభయోగాలు కలుగనున్నాయి. వీరికి ఆర్థిక లాభం మరియు ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరుగనుంది.
- తులా రాశి : హోలీ తర్వాత నుంచి తులా రాశి జాతకులకు ఇంటా బయటా గౌరవ మర్యాదాలు దక్కుతాయి. భూమి, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం లభించనుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉంది. వ్యాపారులకు ఆదాయం మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఇంతకు ముందుకంటే మెరుగ్గా ఉండబోతుంది.
- కుంభ రాశి : కుంభ రాశి వారికి ఉద్యోగాలు, వ్యాపారాల్లో నూతన అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి కెరీర్ పరంగా ఉన్నత అవకాశాలు దక్కుతాయి. వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది.
Daily Updates రోజు వారీ, వారానికి సంబంధించిన రాశి ఫలాలు, జ్యోతిష్య సంబంధించిన కథనాల కోసం Astrologytelugu.com వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.
తాజా సినిమాల పాటలు, భక్తి పాటలు, జానపద పాటల కోసం www.lyricss.co.in వెబ్ సైట్ ను సందర్శించండి.
- వివాహిత మహిళలు తమ వివాహ వస్తువులను ఇతర మహిళలకు దానం లేదా బహుమతిగా ఇవ్వకూడదు. ఇలా చేస్తే వారి భర్తలకు హాని కలుగుతుందని నమ్ముతారు.
- హోలీ రోజున నగలు లేదా ఆభరణాలు దానం చేయకూడదు. దీని వల్ల జాతకంలో శుక్రుడి స్థానం బలహీనపడి భౌతిక సుఖాలు తగ్గడం ప్రారంభమవుతుంది.
- హోలీ దమన్ మరియు హోలీ రోజున డబ్బు దానం చేయకూడదు. ఈ రోజుల్లో డబ్బును విరాళంగా ఇవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ఈరోజుల్లో డబ్బును దానం చేయడం ల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట. ఇందువల్ల భవిష్యత్తులో డబ్బు కొరత ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు.
గమనిక : ఈ సమాచారం మత విశ్వాసాలు, ఇంటర్నెట్లో దొరికి సమాచారం మేరకు అందించడం జరుగుతుంది. వీటిని Astrologytelugu.com ధృవీకరించడం లేదు.
Keywords : Holi Festival 2024, Holi 2024, Holi Astrology, Holi Date 2024, 2024 Holi Date, 2024 Calendar Holi Festival, 2024 Holi, Astrology Telugu, Telugu Astrology, Astrology Holi, Holi Wishes, తెలుగు జాతకం.
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.