Magha Amavasya March 2024 Date and Time : ఆదివారం అమావాస్య అర్ధరాత్రి అంటేనే చాలామంది భయపడుతుంది. హర్రర్ మూవీల్లో ఆదివారం అర్ధరాత్రి సీన్స్ మనల్ని ఉలిక్కి పడేలా చేస్తుంటారు. పురాతన శాస్త్ర ప్రకారంగా ఈ రోజు కొన్ని విశిష్టతలు మరియు మూఢనమ్మకాలు సైతం ఉన్నాయి.
ఆదివారం అమావాస్య దైవశక్తి తగ్గడం వల దుష్టశక్తులు కొన్ని పెట్రేగిపోతాయని కొందరు నమ్ముతుంటారు. ఈ కారణంగా చాలా మంది అమావాస్య రోజు సాయంత్రం నుంచే ఇంటి నుంచి బయటికి రావడం మానేస్తుంటారు. కొన్ని పల్లెటూర్లలో ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతుండటం గమనార్హం.
ఇకపోతే 2024 మార్చి నెల 10వ తేదిన ఆదివారం అమావాస్య తిథి వచ్చింది. పాల్గుగ మాసంలో వచ్చే అమావాస్య అయినందున దీనిని ఫాల్గుణి అమావాస్యగా లేదా మాఘ అమావాస్యగా పిలుస్తారు. ఫాల్గుణ అమావాస్య తిథి మార్చి 9 శనివారం సాయంత్రం 6.17 గంటల నుంచి ప్రారంభమై ఆదివారం (మార్చి 10) మధ్యాహ్నం 2.29 గంటల వకు ఉంటుంది.
సాంప్రదాయ పురాతన ఆచారాల ప్రకారంగా నేటి తిథి చాలా ముఖ్యమైనది. ఈ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి గంగాస్నానం చేయాలి. పూర్వీకుల కోసం ఈరోజున యజ్ఞం చేయాలి. దీని వల్ల పితృ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం శుభప్రదం. ఫాల్గుణి అమావాస్య రోజున అమృతపాఠం చదవడం మంచిది. దీని వల్ల పుణ్యం లభిస్తుంది.
గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే పితృ దోషాలు తొలిగిపోవడంతోపాటు ప్రతికూల శక్తుల దుష్పలితాలు దూరం అవుతాయి. వీటిని ఈరోజు ఆచారించడం ద్వారా చెడు శక్తులు(ప్రభావం) నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఏదిఏమైనా ఫాల్గుణ అమావాస్య రోజున రాత్రి సమయంలో వీలైనంత బయటకు వెళ్లకుండా దైవస్మరణ చేయడం అన్నివిధలా ఉత్తమం.
గమనిక : ఈ సమాచారం
మత విశ్వాసాలు, ఇంటర్నెట్లో దొరికి సమాచారం మేరకు అందించడం జరుగుతుంది. వీటిని Astrologytelugu.com ధృవీకరించడం లేదు.
Daily Updates రోజు వారీ, వారానికి సంబంధించిన రాశి ఫలాలు, జ్యోతిష్య సంబంధించిన కథనాల కోసం Astrologytelugu.com వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.
తాజా సినిమాల పాటలు, భక్తి పాటలు, జానపద పాటల కోసం www.lyricss.co.in వెబ్ సైట్ ను సందర్శించండి.
Keywords : Magha Amavasya 2024, Magha Amavasya Date, Magha Amavasya Tidhi, Amavasya March 2024, Amavasya 2024 Date and Time, Amavasya date 2024, Amavasai 2024 Telugu Calendar. Astrology Telugu, తెలుగు జాతకం.
న్యూమరాలజీ ప్రకారంగా ఇలా చేస్తే సరైన లైఫ్ పార్ట్నర్‌ను గుర్తించవచ్చు
ఆర్టికల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ప్లీజ్ డోంట్ అబ్యూస్ వర్డ్స్. ఈ కథనం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు దీనిని షేర్ చేయండి. ధన్యవాదాలు.
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.