Maha Shivaratri : మహాశివరాత్రికి ఈ పనులు సమస్యలు దూరం..!

Maha Shivaratri : 2024 సంవత్సరంలో మహా శివరాత్రి పర్వదినాన్ని మార్చి 8న జరుపుకోనున్నారు. హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలో మహాశివరాత్రికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. 

Maha Shivaratri

ఈరోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగిపోతాయి. కోట్లాది మంది భక్తులు ఆ మహాదేవుడిని స్మరించుకుంటూ శివ లింగానికి అభిషేకాలు.. పూజలు నిర్వహిస్తారు. 

ఈ మహాశివరాత్రి రోజున శివుడిని స్మరిస్తూ కొన్ని పూజలు నిర్వహిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వైవాహిక జీవితం, కాలసర్ప దోషం, విద్య, వ్యాపారం తదితర సమస్యలను అధిగమించవచ్చని సూచిస్తున్నారు. 

Maha Shivaratri Lord Shiva Statue

పెళ్లికానీ యువతీ యువకులు వివాహ అవకాశాలు పెంచుకోవడానికి మరియు మంచి భార్య లేదా భర్తను పొందడానికి శివరాత్రి రోజున ఈ పనులు చేయాల్సి ఉంటుంది. శివలింగానికి పసుపు, కుంకుమ మిశ్రమాన్ని అర్పించి మహాదేవుడిని స్మరించుకోవాలి. దీని వల్ల ఆ మహాదేవుడి కృప లభించి మీకు సరైన పార్ట్నర్ లభించే అవకాశాలు మెరుగుపడుతాయి.

Shivarathri 2024 : శివరాత్రి ముందు కలలో ఇవి కన్పిస్తే శుభయోగం

కాలసర్ప దోషం ఉన్నప్పుడు రాహు, కేతువులవుల ప్రతికూల పరిస్థితి నెలకొంటుంది. దీని వల్ల జీవితంలో అడ్డంకులు, అనర్థాలను కలుగుతాయి. ఈరోజున శివుడిని ఆరాధించడం మరియు అభిషేకించడం వల్ల కాలసర్ప దోషాన్ని తగ్గించుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు.

Maha Shivaratri Shivalingam Abishekam

విద్యపరంగా రాణించాలని అనుకునే వాళ్లు మారేడు ఆకులపై గాయత్రీ మంత్రాన్ని రాసి శివరాత్రి రోజున శివుడికి సమర్పించాల్సి ఉంటుంది. వ్యాపార పరంగా రాణించాలని అనుకునే వారు శివాలయానికి వెళ్లి ఆ పరమేశ్వరుడికి శంఖం, కౌరీ గవ్వలు, పసుపు సమర్పించాలి. దీని వల్ల వ్యాపార వెంచర్లకు శ్రేయస్సు, విజయావకాశాలు ఎక్కువ అవుతాయని పండితులు చెబుతున్నారు. 

మహా శివరాత్రి నాడు శివ లింగానికి నీరు, పాలు, తేనె, ఇతర పదార్ధాలతో అభిషేకిస్తే శుభ ఫలితాలు కలుగతాయి. ఈరోజున నంది, రాగి పాము ప్రతిమ, పాదరసం శివలింగం, రాగి పాత్రలను కొనుగోలు చేస్తే అదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.  ఈ వస్తువులను హిందూ మతంలో పవిత్రమైనవి భావిస్తారు. వీటివల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని సూచిస్తున్నారు.

 

Maha Shivratri 2024 Special : శివ లింగాన్ని తొలుత పూజించిదెవరు?

Explanation of Gayatri Mantra : గాయత్రీ మంత్రం ప్రయోజనాలు


Keywords : Maha Shivaratri, Maha Shivaratri 2024, Maha Shivaratri Special, Shivaratri, Maha Shivaratri Pooja, Maha Shivaratri Abhishekam, Maha Shivaratri Remedies, Kalasarpa Dosham, Astrology Telugu, మహా శివరాత్రి, శివరాత్రి స్పెషల్, తెలుగు జాతకం.

Post a Comment

గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.