Cat Crying Means in Astrology : జంతుప్రేమికులు చాలా మంది తమతమ ఇళ్ళల్లో కొన్ని జంతువులను పెంచుతుంటారు. మనిషికి విశ్వాసంగా మెలిగే కుక్కలు, పిల్లులు, పక్షులు వంటి వాటిని చాలామంది ఎంతో ఇష్టంతో పెంచుకుంటారు.
మన దేశంలో కంటే ఫారెన్లో ఈ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. కుక్కలను.. పిల్లులను వాళ్లు తమ ఇంటి సభ్యులుగా చూస్తుంటారని చెప్పడం అతిశయోక్తి కాదమో..!
అయితే ఈ కథనంలో పిల్లుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా పిల్లలను పెంచుకోవడం వల్ల మన ఇంటికి శుభమా? లేదా అశుభమా? అనేది తెలుసుకుద్దాం..!
ఉదయాన్నే పిల్లిని చూడటం మంచి సంకేతమని పండితులు చెబుతున్నారు. దీని వల్ల మీ ఇంటికి మిత్రులు లేదా అతిథులు రావచ్చు లేదంటే మీరు ఎక్కడికైనా ప్రయాణం చేస్తారట.
పిల్లి రంగును బట్టి.. మీ ఇంట్లో తెల్ల పిల్లి ఉంటే శుభ సంకేతం. ఇది మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. తెల్ల పిల్లిని పెంచడం వల్ల శుభవార్తలు, శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయట.
పుట్టినతేది బట్టి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చా
నల్ల పిల్లి విషయానికొస్తే మాత్రం శుభం కాదంటున్నారు. దీని కారణంగా ప్రతికూలతత ఇంట్లోకి ప్రవేశించవచ్చని పండితులు పేర్కొంటున్నారు. అందుకే వీటిని పెంచుకునేటప్పుడు మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని పండితులు సూచిస్తున్నారు.
మీ ఇంట్లో పిల్లి తన పిల్లలకు జన్మనిస్తే చాలా మంచి సంకేతమని చెప్పబడుతోంది. మీ ఇంట్లో ఎవరికైనా వివాహానికి ఆటంకాలు ఏర్పడితే సమస్యలు తొలగిపోయి.. మీ ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా.. పిల్లి ఏడుపు ఇంటికి మంచిది కాదంట.. పిల్లి ఏడుస్తుందంటే మీ పనిలో ఆటంకాలు కలుగుతాయని అర్ధమట. ఇంట్లో రెండు పిల్లులు పోట్లాడుకుంటే కుటుంబంలో కలహాలు ఏర్పడుతాయని పండితులు చెబుతున్నారు.
Read more : శివరాత్రి ముందు కలలో ఇవి కన్పిస్తే శుభయోగం
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.