Hanuman Jayanti 2024 : ఏడాది హనుమాన్ జయంతిని ఏప్రిల్ 23 (మంగళవారం) చైత్ర పౌర్ణమి రోజున వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హనుమాన్ భక్తులంతా ఆయన్ని బాల హనుమాన్ రూపంలో పూజిస్తారు.
హిందువుల పండులన్నీ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఇటువంటి పండుగలన్నీ కూడా కొద్దిరోజుల గ్యాప్ లోనే వస్తుంటాయి. ఉదాహరణకు దసరా, దీపావళి కొద్దిరోజుల గ్యాప్ లోనే వస్తాయి. అదేవిధంగా శ్రీరామ నవమి వచ్చిన వారం రోజుల్లోనే ఆంజనేయుడి పుట్టిన రోజు(హనుమాన్ జయంతి) వస్తుంది. ఈ రెండు ప్రత్యేకమైన పర్వదినాలు హిందూ క్యాలెండర్లోని చైత్రమాసంలోనే వస్తుంటాయి.
Read more : 👇👇👇
చైత్ర నవరాత్రి, రామ నవమి, హనుమన్ పుట్టిన రోజు పండుగలన్నీ కూడా చైత్ర మాసంలోనే వస్తుంటాయి. 2024 సంవత్సరంలో ఏప్రిల్ 23న చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి (Hanuman Jayanti) వచ్చింది. ఈ రోజున హనుమాన్ భక్తులు ఆంజనేయ స్వామిని బాల రూపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. హనుమంతుడిని బాల రూపంలో పూజించడం వల్ల జీవితంలోని సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
ఆంజనేయుడి పుట్టిన రోజు సందర్భంగా భక్తులు తమ ఇంటికి కొన్ని వస్తువులు తెచ్చుకోవడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. అదృష్టం మరియు శ్రేయస్సు కోసం భక్తులు తమ ఇంటిలోకి ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలో చూద్దాం..!
హనుమాన్ గద : హనుమంతుడి ఆయుధం గద (Lord Hanuman Gada). ఇది ఎప్పుడూ స్వామివారి చేతిలోనే ఉంటుంది. దీనికి ప్రతికూల శక్తులను నాశనం చేసే సామర్థ్యం ఉంటుంది. అందుకే ఆంజనేయుడి జయంతి రోజున ఒక గదను ఇంటికి తెచ్చుకోవాలి. దీనివల్ల ఇంట్లో ఉండే ఏదైనా చెడు శక్తి బయటికి వెళ్లిపోతుంది. ఒకరకమైన భయం మిమ్మల్ని వేధిస్తుంటే హనుమన్ గదను ఇంట్లో పూజ చేసిన తర్వాత తూర్పు దిశలో ఉంచాలి.
సింధూరం : హనుమంతుడికి సింధూరం అంటే చాలా ఇష్టం. ఆంజనేయ స్వామిని (Sindoor) సింధూరంతో అలంకరిస్తారు. హనుమంతుడి పుట్టిన సందర్భంగా ఆయనకు ఇష్టమైన సింధూరాన్ని ఇంటికి తెచ్చుకోవడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈరోజున స్వామివారికి పూజ చేసి సింధూరాన్ని సమర్పిస్తే హనుమంతుడి ఆశీర్వాదం, అనుగ్రహం లభిస్తాయి.
గొడ్డలి : మీ ఇంట్లో ఏదైనా వస్తుదోషాలు ఉన్నట్లయితే జ్యోతిష్య ప్రకారంగా హనుమాన్ జయంతి నాడు గొడ్డలిని తెచ్చుకోవడం మంచిదట. దీని వల్ల ఇంట్లోని నెగటీవ్ ఎనర్జీ బయటికి వెళుతుందట. అయితే భక్తులు చిన్నపాటి రాగి గొడ్డలి (Copper Axe) తెచ్చుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
వానరం(కోతి) ప్రతిమలు : పురాణాలు హనుమంతుడిని వనరం(కోతి) రూపంలో వర్ణించాయి. ఈ రూపాన్ని భక్తులు అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఆంజనేయస్వామి జయంతిని పురస్కరించుకొని భక్తులు స్వామివారి ప్రతిబింబమైన కోతి ప్రతిమ లేదా కోతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవాలి. దీని వల్ల ఇంట్లోని సమస్యలు దూరమై పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీని వల్ల ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు.
Read more : 👇👇👇
Keywords : Hanuman Jayanthi, Hanuman Jayanti Date, Hanuman Jayanti Time, Anjaneyar Birthday, Bajrangbali Birthday, Hanuman birthday, 2024 Calendar Hanuman jayanti, About Hanuman jayanti, Hanuman jayanti 2024, Hanuman jayanti telugu, hanuman jayanti puja, Hanuman jayanti in Hindi, हनुमान जयंती.
గమనిక
:
ఈ సమాచారం మత విశ్వాసాలు, ఇంటర్నెట్లో దొరికి సమాచారం మేరకు అందించడం
జరుగుతుంది. వీటిని Astrologytelugu.com ధృవీకరించడం లేదు.
Daily Updates రోజు వారీ, వారానికి సంబంధించిన రాశి ఫలాలు, జ్యోతిష్య సంబంధించిన కథనాల కోసం Astrologytelugu.com వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.
తాజా సినిమాల పాటలు, భక్తి పాటలు, జానపద పాటల కోసం www.lyricss.co.in వెబ్ సైట్ ను సందర్శించండి.
Read more : 👇👇👇😍
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.