Life Partner Astrology : లైఫ్ పార్ట్నర్ గా ఇలాంటి అమ్మాయిలు వస్తే..!

Future Life Partner Astrology : ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అనే నానుడి మన పెద్దవాళ్లు చెబుతూ ఉండేవి. మనిషి జీవితంలో ఇల్లు ఎంత ముఖ్యమో.. ఇల్లాలు కూడా అంతే ముఖ్యం. ఇంటి విషయంలో కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. కానీ పెళ్లి విషయంలో మాత్రం తప్పటడుగు వేస్తే మాత్రం జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. 

Life Partner Astrology

అమ్మాయిలు.. అబ్బాయిలు తమ జీవితంలో వచ్చే భార్య, భర్తల గురించి ఎన్నో కలలు కంటారు. అబ్బాయి రాకుమారుడిలా ఉండాలనో.. మంచి ఉద్యోగం, జీతం, ఆస్తులు లేదా తనను అర్థం చేసుకుని తనవాళ్లను మంచిగా చూసుకునే వాళ్లు కావాలనో అమ్మాయిలు కోరుకుంటారు. అబ్బాయిలు కూడా తమకు అప్సరస లాంటి అమ్మాయి కావాలనో లేదంటే కట్నకానుకలు తెచ్చే అమ్మాయో, చదువుకున్న అమ్మాయి, గుణవంతురాలైన అమ్మాయి కావాలనో కోరుకుంటారు. 

అయితే అమ్మాయిలు, అబ్బాయిల వయస్సుల బట్టి కూడా వారి వారి కోరికలు మారుతుంటాయి. 18 నుంచి 21 ఏళ్ళ లోపు అమ్మాయిలకు ఐశ్వర్య రాయ్.. హృతిక్ రోషన్ లాంటి వాళ్లను చూపించినా ఇంకా ఏదో కావాలని అడుగుతుంటారు. అదే 25 నుంచి 30 వయస్సు వారైతే తమకు మంచి భర్త లేదా భార్య రావాలని కోరుకుంటారు. ఇక 30 నుంచి 35 దాటితే ఎవరో ఒకరు అన్నట్లుగా సర్దుకు పోతుంటారు. 

Future Life Partner Astrology

దంపతుల జీవితం సాఫీగా సాగాలంటే భార్యాభర్తల మధ్య సహకారం అవసరం. ఇల్లాలు కుటుంబంతో సామరస్యంగా ఉండాలి. ఓర్పు, నేర్పుతో సంసారాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కష్ట సమయాల్లో భర్తకు అండగా ఉండాలి. ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు భార్యలు వస్తే ఆ భర్తకు ప్రతీరోజు ఓ పండగలాగే గడుస్తుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా అలాంటి లక్షణాలు ఉన్న స్త్రీల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!

లైఫ్ పార్ట్నర్ గా ఇలాంటి అమ్మాయిలు వస్తే..  మగవాళ్లకి ప్రతి రోజూ పండగే పండుగ..!

Predict My life Partner Free | Wife Astrology

  • కన్య :  కన్యారాశి అమ్మాయిలు పెళ్లి తర్వాత తమ కుటుంబాన్ని బలోపేతం చేసుకోవడంపై ఫోకస్ పెడతారు. కుటుంబ వ్యవహరాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అన్ని తామై చూసుకుంటారు. ఇంటి పనులను చక్కగా మేనేజ్ చేస్తారు. వీరు వివాహ బంధంలో మరియు వ్యక్తిగత జీవితంలో స్పష్టతను కోరుకుంటారు. చక్కటి ఆలోచన విధానంతో కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. గృహ వాతావరణం దెబ్బతినకుండా ఇంట్లోని వారందరితో సామరస్యంగా కలిసి మెలిసి ఉంటారు. అంకితభావం, నిబద్ధతతో భర్తలకు నమ్మదగిన భాగస్వాములుగా ఉంటారు.
Lord Shivararti

  • వృశ్చికం : వృశ్చిక రాశి స్త్రీలు వివాహ బంధానికి కట్టుబడి ఉంటారు. దాంపత్య బందానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. భర్తల ఇష్టానుసరంగా నడుచుకుంటూ విధేయతను చూపుతారు. ఈ లక్షణాలన్నీ ఈ రాశి మహిళలను గొప్ప భార్యలుగా మారుస్తాయి. ఈ జాతకులు మంచి వ్యక్తిత్వం, దృఢమైన సంకల్పంతో తమ జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచుతారు. వారి సుఖ దుఃఖాల్లో ఎల్లప్పుడు తోడుగా నిలబడుతారు.
Future Spouse Prediction | Astrology

  • వృషభం : వృషభరాశి మహిళలు స్థిరత్వం, విధేయతకు ప్రతీక. వీరు కుటుంబ భద్రత, శ్రేయస్సుకు కట్టుబడి ఉంటారు. తమ భర్తలకు నమ్మకమైన జీవిత భాగస్వాములుగా ఉంటారు. నిబద్ధతతో ఇంటి పనులు చక్కబెడుతూ దాంపత్య బందాన్ని బలోపేతం చేసుకుంటారు. జీవితంపై పూర్తి స్థాయి అవగాహనతో ఉంటారు. వీరి వ్యక్తిత్వంతో భర్తలను ఆకట్టుకుంటారు. కుటుంబానికి అన్ని విషయాల్లో అండగా నిలుస్తూ భర్తలను మన్నలను పొందుతారు. 
Lord Anjaneya Swamy
  • కర్కాటకం : కర్కాటకరాశి అమ్మాయిలు ప్రేమ, దయ, సానుభూతి స్వభావం కలిగి ఉంటారు. వీరు దాంపత్యానికి ఎక్కువ విలువనిస్తారు. భర్తల ఇష్టానుసారంగానే నడుచుకుంటారు. వీరి జీవితాన్ని భర్తలకు అంకితం చేస్తారు. భర్త చెప్పే మాటకు కట్టుబడి ఉంటారు. ఇంటి పనులు నేర్పుగా చక్కదిద్దుతారు. ఇంట్లోని కుటుంబ సభ్యులపై ప్రేమానురాగాలు చూపిస్తారు. కుటుంబం కోసం నిత్యం ఆలోచిస్తారు. తమ భర్తల సేవలో తరిస్తూ మంచి ఇల్లాలిగా గుర్తింపు దక్కించుకుంటారు. 
Marriage Partner Prediction | New Couples

  • మీనం : మీన రాశి స్త్రీలు సున్నితత్వం మరియు కరుణకు ప్రతీక. ఈ రాశి మహిళలు తమ భర్తల అవసరాలను తీర్చేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. భావోద్వేగాలను అర్థం చేసుకుంంటూ కుటుంబంలో భర్తకు అండగా నిలుస్తారు. మాటల్లో స్పష్టత, పరస్పర అవగాహనతో కుటుంబ వ్యవహారాలను చక్కబెడుతారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటారు. భర్త ఆనందం మరియు శ్రేయస్సుకు ఎక్కువగా విలువను ఇస్తారు.
Numerology

గమనిక : ఈ సమాచారం మత విశ్వాసాలు, ఇంటర్నెట్లో దొరికి సమాచారం మేరకు అందించడం జరుగుతుంది. వీటిని Astrologytelugu.com ధృవీకరించడం లేదు.

Daily Updates రోజు వారీ, వారానికి సంబంధించిన రాశి ఫలాలు, జ్యోతిష్య సంబంధించిన కథనాల కోసం Astrologytelugu.com వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.

తాజా సినిమాల పాటలు, భక్తి పాటలు, జానపద పాటల కోసం www.lyricss.co.in వెబ్ సైట్ ను సందర్శించండి.

 ఆర్టికల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ప్లీజ్ డోంట్ అబ్యూస్ వర్డ్స్. ఈ కథనం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు దీనిని షేర్ చేయండి. ధన్యవాదాలు.


Read more : 👇

Color Astrology

Keywords : Life Partner Astrology | Predict My Life Partner Free | Life Partner Prediction By Date Of Birth | Spouse Prediction By Date Of Birth And Time Free | Future Partner Prediction | Future Spouse Prediction | Future Spouse Prediction Free | Predict My Life Partner Free | Spouse Prediction By Date Of Birth | Life Partner Prediction Based On Date Of Birth Free | My Future Spouse Prediction | Future Partner Astrology | Future Life Partner Prediction | Marriage Partner Prediction | According To Astrology Who Is My Life Partner | Astrology For Future Life Partner | Find My Life Partner By Astrology | Find Your Life Partner Astrology | Astrology | Numerology | Color Astrology | Astrology Telugu.

Post a Comment

గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.