Numerology : న్యూమరాలజీ ప్రకారంగా వివిధ తేదిల్లో జన్మించిన వారి వ్యక్తుల స్వభావం మరియు వ్యక్తిత్వాన్ని అంచనా వేయచ్చు. కొన్ని తేదిల్లో జన్మించిన వాళ్లు చాలా సామ్యులుగా.. మృదువుగా ఉంటే మరికొందరు మాత్రం ముక్కు మీద కోపంతో లేదా దూకుడుగా ఉంటారు.
పరిస్థితులు బట్టి ఎమోషన్స్ మారుతూ ఉంటాయి. అయితే కొందరు మాత్రం పరిస్థితులతో సంబంధం లేకుండా కోపాన్ని తెచ్చుకుంటారు. ఈ కారణంగా అలాంటి వ్యక్తులు ఎన్నో అవకాశాలు చేజార్చుకోవడంతోపాటు జీవితంలో దుర్భర పరిస్థితులు ఎదుర్కుంటూ ఉంటాయి.
తన కోపమే తన శత్రువు అని మన పెద్దలు చెబుతుంటారు. కోపం కారణంగా కొందరు తమ జీవితంలో డబ్బు, సమయంతోపాటు సంతోషాన్ని సైతం కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. క్షణకాలం పాటు వచ్చే కోపం కారణంగా ఎన్నో అనార్థాలు, అపార్థాలకు దారితీస్తుంది. తమ ప్రేమయం లేకుండా వచ్చే కోపం కారణంగా ఎంతోమంది అందమైన జీవితాన్ని కోల్పోయారు.
అనవసరంగా వచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగే అవకాశం ఉంటుంది. కోపం అదుపులో ఉంటే ఆరోగ్యం కూడా మనకు సహకరిస్తుంది. తద్వారా ఆనందమైన, సంతోషకరమైన జీవితాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారంగా చూసుకుంటే 9, 18, 27, 29, 30 తేదిల్లో జన్మించిన వారికి కోపం ఎక్కువగా ఉంటుందట. ఇలాంటి వ్యక్తులు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మాత్రం జీవితంలో వీరికి తిరుగుతుందని న్యుమారాలజిస్టులు పేర్కొంటున్నారు.
Number Numerology : ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు కోపాన్ని తగ్గించుకుంటే.. తిరుగుండదు..!
9వ తేదీన జన్మించిన వ్యక్తులు (Number 9 Numerology) : ఏదైనా నెలలో తొమ్మిదవ తేదీన జన్మించిన వ్యక్తులు తీవ్రమైన ఆవేశానికి ఈజీగా లోనవుతారు. 9వ నెంబర్ అనేది అభిరుచి, న్యాయం వంటి భావనలతో ముడిపడి ఉంటుంది. అందుకే ఈ తేదిలో జన్మించిన వ్యక్తులు బలమైన ఎమోషనల్ ఫీలింగ్స్ కలిగి ఉంటారు. ఈ వ్యక్తులకు సామాజిక సమస్యలతోపాటు నైతికతపై బలమైన ఆలోచనలు ఉంటాయి. అందుకే వీరు అన్యాయాలను లేదా అతిక్రమణలను చూసినప్పుడు చాలా ఈజీగా కోపం మరియు ఆగ్రహానికి లోనవుతారు.
18వ తేదీన జన్మించిన వ్యక్తులు (Number 18 Numerology) : ఏదైన నెలలో 18వ తేదిన జన్మించిన వ్యక్తులు సైతం త్వరగా కోపానికి గురవుతారు. ఒకటి మరియు 8 అంకెల శక్తి ఇండిపెండెంట్ నెంబర్ 18ని సృష్టిస్తుంది. ఈ సంఖ్య ఆశయం మరియు స్వత్రంత్య భావాల కలయికను సూచిస్తుంది. దీని కలయిక వల్ల చిరాకు, అసహనం ఏర్పడుతుంది. తద్వారా ఈ కాంబినేషన్(18) తేదిలో జన్మించిన వ్యక్తులు త్వరగా ఉద్రేకానికి లోనవుతూ ఆవేశంతో ఊగిపోతారు. వీరి కోపం కారణంగా అనేక సమస్యలను తెచ్చిపెట్టుకుంటారు.
27వ తేదీన జన్మించిన వ్యక్తులు (Number 27 Numerology) : ఏదైనా నెలలో 27 తేదీన జన్మించిన వ్యక్తులు ఎమోషనల్ మరియు సెన్సిటివ్ గా ఉంటారు. వీరు కోపాన్ని మరియు ఆవేశాన్ని బలంగా చూపిస్తారు. నెంబర్ 2 అనేది స్వతంత్రత మరియు హామీని సూచిస్తుంది. నంబర్ 7 అనేది ప్రేమ, దయగల స్వభావాన్ని సూచిస్తుంది. 2 మరియు 7 నెంబర్ల కలియిక వల్ల 27 ఏర్పడుతుంది. ఈ కాంబినేషన్ కారణంగా ఈ తేదిలో జన్మించిన వ్యక్తులు అంతర్గత ఇబ్బందులు కారణంగా భావోద్వేగంతో ముడిపడిన కోపాన్ని కలిగిస్తాయి. వీరు సైతం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మంచి స్థాయికి ఎదుగుతారు.
29వ తేదీన జన్మించిన వ్యక్తులు (Number 29 Numerology) : 29వ తేదిన జన్మించిన వ్యక్తులు త్వరగా ప్రతిస్పందించే లక్షణాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు ఆలోచన లేకుండా హఠాత్తుగా కోపాన్ని ప్రదర్శిస్తారు. నెంబర్ 2 మరియు నెంబర్ 9 సంఖ్యలు ధైర్యం, ఆవేశాన్ని కలిగిస్తాయి. ఈ కాంబినేషన్లో నంబర్ 29 ఏర్పడుతుంది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనపుడు ఈ వ్యక్తులు తొందరపాటుకు లోనవుతారు. ఎమోషనల్ రియాక్షన్స్ వల్ల చిరాకుకు లోనై ఆవేశాన్ని ప్రదర్శిస్తారు. తద్వారా లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టుకుంటారు.
30వ తేదీన జన్మించిన వ్యక్తులు (Number 30 Numerology) : ఏదైన నెలలో 30వ తేదిన జన్మించిన వ్యక్తులు వినూత్న రీతిలో ఆవేశాన్ని ప్రదర్శిస్తారు. నంబర్ 3 అనేది లవ్, కేరింగ్‌ను సూచిస్తే.. 0 అనేది ఊహాత్మకంగా, ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటుంది. ఈ కాంబినేషన్లో 30 నెంబర్ ఏర్పడుతుంది. ఈ కారణంగా ఈ తేదిలో జన్మించిన వ్యక్తులు తమలోని నిరాశను మాటల ద్వారా లేదా కళాత్మకంగా తెలియజేస్తుంటారు. ఏదిఏమైనప్పటికీ పై తేదిల్లో జన్మించిన వ్యక్తులతోపాటుగా ఎవరైనా సరే కోపాన్ని అదుపులో ఉంచుకోని వీలైనంత వరకు సమస్యలకు దూరంగా ఉండొచ్చు. తద్వారా ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది.
Read more : 👇👇👇😍
Read more : 👇👇👇😍
గమనిక
:
ఈ సమాచారం మత విశ్వాసాలు, ఇంటర్నెట్లో దొరికి సమాచారం మేరకు అందించడం
జరుగుతుంది. వీటిని Astrologytelugu.com ధృవీకరించడం లేదు.
Daily Updates రోజు వారీ, వారానికి సంబంధించిన రాశి ఫలాలు, జ్యోతిష్య సంబంధించిన కథనాల కోసం Astrologytelugu.com వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.
తాజా సినిమాల పాటలు, భక్తి పాటలు, జానపద పాటల కోసం www.lyricss.co.in వెబ్ సైట్ ను సందర్శించండి.
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.